Physical Harassment: కోచింగ్ సెంటర్లో విద్యార్థినిపై లైంగిక వేధింపులు.. టీచర్ అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబైలో విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఓ టీచర్. ఆంటోప్ హిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సియోన్ కోలివాడ ప్రాంతంలో ఉన్న కోచింగ్ సెంటర్లో 16 ఏళ్ల విద్యార్థిని కోచింగ్ తీసుకుంటుంది. ఈ క్రమంలో వేధింపుల ఘటన వెలుగులోకి రావడంతో.. బాధితురాలి కుటుంబసభ్యుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితుడిపై పోక్సో చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసును విచారించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Read Also: Cyclone Michaung: ముంచుకొస్తున్న మిచౌంగ్… దక్షిణ కోస్తాను ముంచెత్తనున్న తీవ్ర తుఫాన్
Also Read
వివరాల్లోకి వెళ్తే.. విద్యార్థిని ఈ సంవత్సరం కోచింగ్ సెంటర్లో అడ్మిషన్ తీసుకుంది. అయితే ఓ టీచర్.. తరచూ ఆమెను వేధించేవాడని.. పలుమార్లు లైంగికంగా వేధించాడని బాధితురాలు తెలిపింది. నిందితుడి చర్యలతో విసిగిపోయిన విద్యార్థిని తన కుటుంబ సభ్యులకు విషయాన్ని చెప్పింది. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది ఆగస్టులో మరో ఉపాధ్యాయుడి రాసలీలలు వెలుగులోకి రావడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. ముంబై ఠాగూర్ నగర్‌లోని ఓ పాఠశాలలో ఒకటిన్నర నెలల్లోనే ఓ స్పోర్ట్స్ టీచర్ తన భోగభాగ్యాలకు నలుగురు విద్యార్థినులను బలితీసుకున్నాడు. ఇలా ఒకరి తర్వాత ఒకరుగా విద్యార్థినులపై అత్యాచార ఘటనలకు పాల్పడ్డాడు నిందితుడు. చివరకు విసుగు చెంది బాధిత విద్యార్థులు విషయాన్ని బయటపెట్టారు.
Read Also: YS Raja Reddy: షర్మిలక్కకు కాబోయే కోడలు.. హీరోయిన్ లెక్క ఉందే..?
బాధిత బాలికల ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు నిందితుడిపై అత్యాచారం, పోక్సో చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో నిందితుడు ఈ సంఘటనలను అంగీకరించడమే కాకుండా, మునుపటి పాఠశాలలో కూడా ఇలాంటి సంఘటనలకు పాల్పడ్డాడని చెప్పాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!