YS Raja Reddy: వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆమె ఎంత ఫేమసో.. ఆమె కొడుకు రాజారెడ్డి అంతే ఫేమస్. ఈ ఏడాది రాజారెడ్డి ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. షర్మిల కొడుకు హీరోలా ఉన్నాడు అంటూ కొందరు చెప్పుకురాగా.. త్వరలోనే రాజారెడ్డి హీరోగా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా వార్తలు వచ్చాయి. ఇక రాజారెడ్డి అమెరికాలోని డల్లాస్ యూనివర్సిటిలో బ్యాచిలర్ అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సును పూర్తి చేసి పట్టా అందుకొని ఇండియాకు తిరిగివచ్చాడు. ఈ కుర్రాడు నెక్స్ట్ ప్లాన్ ఏదై ఉంటుంది.. బిజినెస్ చేస్తాడా.. ? అమ్మలా రాజకీయాలు అంటాడా.. ? అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూడగా.. రాజారెడ్డి మాత్రం ప్రేమ, పెళ్లి అంటూ చెప్పుకురావడం షాకింగ్ గా మారింది. వైఎస్ రాజారెడ్డి త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి.
Samantha: సమంత కు రూ. 6 కోట్ల బంగ్లా గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత.. అందుకే ఆ పని చేసిందా.. ?
ఇక దీంతో షర్మిలక్క కు కాబోయే కోడలు ఎవరు.. ? ఎలా ఉంటుంది అంటూ ఫ్యాన్స్ గూగుల్ సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. ఇక ఆమె పేరు ప్రియ అట్లూరి. ఇప్పటివరకు ఆమె చట్నీస్ సంస్థల అధినేత ప్రసాద్ మనవరాలు అంటూ వార్తలు రాసుకొచ్చారు. కానీ అందులో నిజం లేదని తెలుస్తోంది. ప్రియా అట్లూరిది కమ్మ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి అని సమాచారం. వీరిద్దరూ డల్లాస్ యూనివర్సిటిలో ఫ్రెండ్స్ అంట. ఇక 4 ఏళ్లుగా వీరు ప్రేమలో ఉన్నారని, వీరి ప్రేమ వివాహానికి ఇరు కుటుంబాలు ఓకే చెప్పడంతో వచ్చే ఏడాది మే లో వీరి వివాహం ఉండబోతుందని తెలుస్తోంది. ఇక ప్రియ కూడా చూడడానికి ఎంతో అందంగా ఉంది. రాజారెడ్డికి ఈడుజోడు బావుందని, అమ్మాయి కూడా హీరోయిన్ లెక్కనే ఉందని, షర్మిలక్కకు మంచి కోడలు దొరికిందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మరి షర్మిల ఈ విషయమై ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి.