బీహార్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నదిలో స్నానానికి వెళ్లి ఏడుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. సోన్ నదిలో పడి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు పిల్లలు మునిగిపోయారు. వారిలో ఐదుగురు చిన్నారుల మృతదేహాలను బయటకు తీశారు. ఇద్దరు పిల్లల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.