తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా- సెప్టెంబర్ 17న జరుపనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. భారత యూనియన్‌లో హైదరాబాద్ స్టేట్ కలిసిన సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పబ్లిక్ గార్డెన్స్‌లో నిర్వహించే ఈ వేడుకల్లో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. అదేవిధంగా.. జిల్లా కేంద్రాల్లో కూడా అదే రోజు ఉదయం 9 గంటలకు ఈ వేడుకలను నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ప్రభుత్వ చీఫ్‌విప్‌లు, విప్‌లు జాతీయ జెండాలను ఎగురవేయనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Also Read : Kishan Reddy : తెలంగాణ ఓ కుటుంబం చేతిలో బంది అయ్యింది
1948వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ సువిశాల భారతదేశంలో అంతర్భాగంగా మారింది. రాచరిక పరిపాలన నుండి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందింది. అందుకే ఈ సందర్భంగా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నాం. అయితే.. సెప్టెంబర్ 17న జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నిన్న ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని నిర్వహించాలని, పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. తెలంగాణ భారత సమాఖ్యలో విలీనమైన 17న జాతీయ సమైక్యత దినోత్సవంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు జరుపుకుంటున్నారన్న కేటీఆర్, ఆ రోజును ఘనంగా ఎక్కడికి అక్కడ సంబురంగా నిర్వహించుకోవాలన్నారు మంత్రి కేటీఆర్.
Also Read : Etela Rajender : కేసీఆర్ బీజేపీ పార్టీ ఎక్కడిది అని ఎగతాళి చేస్తాడు