ఏపీలో ప్రతిరోజూ ఏదో ఒక ప్రాంతంలో గంజాయి గుప్పుమంటోంది. గంజాయి, మత్తుపదార్ధాలు యథేచ్ఛగా రవాణా అవుతున్నాయి. తాజాగా ఆంధ్రా యూనివర్శిటీలో గంజాయి దొరకడం కలకలం రేపుతోంది. ఆంధ్రావిశ్వవిద్యాలయంలో గంజాయి విక్రయిస్తున్నారు సెక్యూరిటీ గార్డులు. ఈనేపథ్యంలో సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేశారు. రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు పోలీసులు. ఏయూ సెక్యూరిటీ ఆఫీసర్ కారు డ్రైవరే కీలక సూత్రధారిగా తేలింది. నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. పరారీలో ఉన్న మరొకరి కోసం గాలిస్తున్నారు. రెండు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి,దర్యాప్తు చేస్తున్నారు త్రీ టౌన్ పోలీసులు. చదువుల నిలయం ఏయూలో గతంలో గంజాయి వాడుతున్నారని ఆరోపణలు వచ్చాయి. తాజాగా సెక్యూరిటీ గార్డులే గంజాయిని రవాణా చేస్తూ అడ్డంగా దొరికిపోవడం సంచలనంగా మారింది. అధికారులు ఇలాంటి చర్యల పట్ల అప్రమతంగా ఉండాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని విద్యార్ధులు, విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.
Read Also: CM KCR: ప్రతి డివిజన్‌లో ఆధునిక మార్కెట్లు.. కల్తీ బెడద లేకుండా చేస్తాం
మరోవైపు రెండురోజుల క్రితం కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గం చల్లపల్లిలో గంజాయి విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు చల్లపల్లి పోలీసులు. బాపట్ల జిల్లా రేపల్లె గ్రామానికి చెందిన మల్లవోలు ఆదిశేషు అతని భార్య వెంకటేశ్వరమ్మ, చల్లపల్లి కి చెందిన కోట అనిల్ కుమార్, చిలక అజయ్ అను నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 2.5 కేజీల గంజాయి, 3010 రూపాయల నగదు,3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
వీరు విజయవాడలో గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర నుంచి గంజాయిని తీసుకువచ్చి చల్లపల్లి, రేపల్లె గ్రామాలలో ఉన్న యువతను గంజాయికి బానిసలుగా మారుస్తున్నట్లు అవనిగడ్డ డి.ఎస్.పి మహబూబ్ బాషా తెలిపారు. ఎన్జీవోల సహాయంతో యువతకు జిల్లా ఎస్పీ జాషువా ఆధ్వర్యంలో తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇప్పించారు అధికారులు. చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడితే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు వెనకాడమని అవనిగడ్డ డిఎస్పీ మహబూబ్ బాషా హెచ్చరించారు. పిల్లల కదలికలపై, వారి మానసిక స్థితిపై ఒక కన్నేసి ఉంచాలని పోలీసులు సూచించారు.
Read Also: Bhatti Vikramarka: ప్రధాని మోడీపై భట్టి కౌంటర్లు.. ప్రధానికి శాస్త్రీయ దృక్పధం లేదు