Jio IPO: మీకు జియోలో వాటా కావాలా..? ఐపీఓకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన సెబీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్ విభాగమైన ‘జియో ప్లాట్ఫార్మ్స్’ తొలి పబ్లిక్ ఆఫరింగ్ (IPO) ప్రతిపాదనకు భారత మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’ తుది ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూ ద్వారా కంపెనీ దాదాపు 27 కోట్ల కొత్త ఈక్విటీ షేర్లను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సమాయత్తమవుతోంది. విశ్లేషకుల అంచనాల ప్రకారం.. ఈ ఆఫర్ ద్వారా కంపెనీ సుమారు రూ. 37,000 కోట్లకు పైగా నిధులను సమీకరించే అవకాశం ఉంది. దీంతో భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అత్యంత భారీ ఐపీఓలలో ఒకటిగా జియో ప్లాట్ఫార్మ్స్ నిలవనుంది.
ఈ ఐపీఓ ప్రత్యేకత ఏమిటంటే.. ఇది పూర్తిగా ‘ఫ్రెష్ ఇష్యూ’ (Fresh Issue) రూపంలో వస్తోంది. అంటే, పాత భాగస్వాములు లేదా ప్రమోటర్లు తమ వద్ద ఉన్న వాటాలను విక్రయించే ఆఫర్ ఫర్ సేల్ (OFS) విధానం ఉండదు. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా వచ్చే నిధుల మొత్తాన్ని నేరుగా కంపెనీ ఖాతాలోనే జమ చేస్తారు. సేకరించిన నిధులను ప్రధానంగా కంపెనీకి చెందిన పాత రుణాలను చెల్లించడానికి, డిజిటల్ నెట్వర్క్ మౌలిక వసతులను మరింత ఆధునీకరించడానికి, 5G , రాబోయే తరం సాంకేతికతల విస్తరణకు, ఇతర జనరల్ కార్పొరేట్ అవసరాలకు ఉపయోగించనున్నారు.
Also Read
ఈ ఈక్విటీ షేర్లు బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (NSE) రెండింటిలోనూ లిస్ట్ కానున్నాయి. మెటా, గూగుల్ వంటి గ్లోబల్ దిగ్గజాల పెట్టుబడులు ఉండటం, దేశంలోనే అతిపెద్ద టెలికాం, డిజిటల్ నెట్‌వర్క్‌గా 50 కోట్లకు పైగా ఇన్వెస్టర్ల మద్దతు ఉండటంతో ఈ పబ్లిక్ ఇష్యూపై మార్కెట్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ భారీ ఆఫర్ ద్వారా జియో గ్లోబల్ స్థాయిలో తన సామర్థ్యాన్ని, విలువను ప్రపంచానికి చాటనుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. రిటైల్, సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి ఈ ఐపీఓకి విశేష స్పందన లభించే అవకాశం కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Jio IPO: మీకు జియోలో వాటా కావాలా..? ఐపీఓకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన సెబీ..
-
CM Chandrababu : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
-
Rakhi Sawant: మక్కాలో అల్లాకు రాఖీ ప్రార్థనలు.. జెన్-జీకి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకోలు..
-
Veligonda Project : వెలిగొండ నిర్వాసితులకు బిగ్ గుడ్ న్యూస్.. చంద్రబాబు కీలక ఆదేశాలు
-
AP Govt: 18 ఏళ్లు నిండిన యువతకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. రూ.2 లక్షల చొప్పున సాయం..
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!