AP Elections 2024: సార్వత్రిక ఎన్నికల్లో మరో కీలక ఘట్టం ముగిసింది.. నామినేషన్ల పరిశీలన పూర్తి చేశారు అధికారులు.. సరైన ఫార్మాట్ లో లేని నామినేషన్లను తిరస్కరించారు ఎన్నికల సంఘం అధికారులు.. దీంతో.. బరిలో నిలిచేది ఎవరో తేలిపోయింది.. రాష్ట్రంలోని 25 పార్లమెంట్ సెగ్మెంట్లకు 1,103 నామినేషన్ల దాఖలు అయ్యాయి.. అయితే, పార్లమెంట్ స్థానాలకు దాఖలైన నామినేషన్లలో 127 నామినేషన్లను తిరస్కరించారు అధికారులు.. 301 నామినేషన్లకు ఆమోదం తెలిపారు. మరోవైపు, 175 అసెంబ్లీ సెగ్మెంట్లకు 5,997 నామినేషన్ల దాఖలు అయ్యాయి.. అసెంబ్లీ స్థానాలకు దాఖలైన నామినేషన్లల్లో 598 తిస్కరించిన అధికారులు.. 1381 నామినేషన్లకు ఆమోదం తెలిపారు.. ఒక స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ విత్ డ్రా చేసుకున్నాడు.. ఇవాళ రాత్రికి సీఈవో కార్యాలయానికి పూర్తి స్థాయిలో వివరాలను అప్డేట్ చేయనున్నారు ఎన్నికల అధికారులు.. ఆ తర్వాత వివరాలను అధికారులు వెల్లడించే అవకాశం ఉంది.
Read Also: Loksabha Elections 2024: ఆదర్శంగా నిలిచిన 106 ఏళ్ల బామ్మ.. ఓటేసిన వృద్ధురాలు
కాగా, ఏపీలో ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల తర్వాత అభ్యర్థులు నామినేషన్ల ప్రక్రియ మొదలుపెట్టారు.. ఏప్రిల్ 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు.. ఈ రోజు నామినేషన్ల పరిశీలన పూర్తి కాగా.. ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణకు గడవు ఇచ్చారు. ఇక, మే 13న పోలింగ్ జరగనుండగా.. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు ప్రకటించనున్న విషయం విదితమే.