తాజాగా రైల్వే శాఖ సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగానే ప్రయాణికులు క్యూఆర్ కోడ్ ద్వారా ప్రయాణ టికెట్లను కొనుగోలు చేసుకోవచ్చు. ఈ నిబంధనలో టికెట్ కౌంటర్ దగ్గర టికెట్ కోసం క్యూలో నిలబడాల్సిన సమయం తగ్గనుంది. ఈ విషయానికి సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..
Also read: Lok Sabha Elections 2024 : ఏప్రిల్ 19న ఎలక్షన్స్.. డ్యూటీ చేయలేమంటూ వందలాది దరఖాస్తుల వెల్లువ
తాజాగా దక్షిణ మధ్య రైల్వే తన రైలు ప్రయాణకుల కోసం క్యూఆర్ కోడ్ ఉపయోగించి సాధారణ రైల్వే టికెట్లను బుక్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగానే మొదటగా ఫస్ట్ ఫేస్ లో భాగంగా సికింద్రాబాద్ డివిజన్ లో ఉన్న 14 స్టేషన్లో ఉన్న 31 కౌంటర్ల వద్ద ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సదుపాయాన్ని ముఖ్యంగా డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే విధంగా రైల్వే శాఖ అడగులు వేసింది. జనరల్ బుకింగ్ కౌంటర్ లో ఉన్న క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి సెకన్ల లోనే ట్రైన్ టికెట్ పొందేల అధికారులు చర్యలు చేపట్టారు.
Also read: Inspector Rishi : ఇంట్రెస్టింగ్ గా ‘ఇన్స్పెక్టర్ రిషి’ ట్రైలర్.. భయపెడుతున్న సన్నివేశాలు..
ఇకపోతే టికెట్ తీసుకొనే సమయంలో బాగా ఎదుర్కొనే సమస్య చిల్లర. ముఖ్యంగా ఈ చిల్లర సమస్యలకు చెక్ పడేటట్లుగా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. సికింద్రాబాద్ పరిధిలోని.. సికింద్రాబాద్, హైదరాబాద్, కాజీపేట, వరంగల్, బేగంపేట, మంచిర్యాల, లింగంపల్లి, హైటెక్ సిటీ, జేమ్స్ స్ట్రీట్, మహబూబాబాద్, బెల్లంపల్లి, ఫతేనగర్ బ్రిడ్జ్, సిర్పూర్ కాగజ్ నగర్, వికారాబాద్ స్టేషన్లో ఈ సేవలను మొదలుపెట్టింది రైల్వే శాఖ. ఇకపోతే ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే జనరల్ బుకింగ్ కౌంటర్లలో మాత్రమే క్యూఆర్ కోడ్ సంబంధిత అన్ రిజర్వేషన్ సీట్లను కొనుగోలు చేసే విధంగా ఉందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలియజేశారు.