Justice Sanjiv Khanna: దేశ రాజధానిలో ఢిల్లీలో నానాటికీ పెరుగుతున్న కాలుష్యం నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా కీలక సూచనలు చేశారు. ఢిల్లీలో వాయు కాలుష్యం పెరుగుతుండటంతో వీలైతే జడ్జీలు వర్చువల్‌గా కేసుల విచారణ చేయాలని ఆదేశించారు.
ఢిల్లీ ఎన్‌సిఆర్‌లో ఇకపై 10-12 తరగతులు కూడా ఆన్‌లైన్‌లో ఉండాలని కోర్టు ఆదేశించింది. ఇంతకుముందు ఫిజికల్ మీడియం ద్వారా పాఠశాలకు వెళ్లేవారు. అలాగే.. ప్రభుత్వ కార్యాలయాల్లో 50 శాతం ఉద్యోగులతో పనిచేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది.