SBI changed Rule For ATM Cash Withdrawal: దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో కీలక నిర్ణయం తీసుకుంది. మోసపూరిత లావాదేవీల నుంచి కస్టమర్లకు రక్షణ కలిగించేందుకు వన్ టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) ఆధారిత నగదు విత్‌డ్రా సేవలను ప్రారంభించింది. ఈ సేవల ప్రకారం ఎస్‌బీఐ ఖాతాదారుడు రూ.10వేలకు మంచి ఏటీఎంలో నగదు విత్‌డ్రా చేయాలంటే మొబైల్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రూ.10వేల వరకు ఓటీపీ అవసరం లేకుండా నగదు విత్‌డ్రా చేసుకోవచ్చని.. రూ.10వేలకు మంచి నగదు విత్‌డ్రా చేయాలంటే మాత్రమే ఓటీపీ ఎంటర్ చేయాలని ఎస్‌బీఐ అధికారులు వెల్లడించారు.
Read Also: 5G Spectrum: 5జీ స్పెక్ట్రం వేలానికి వేళాయె. మరికొద్దిసేపట్లోనే ప్రారంభం.
అంటే రూ.10వేల కంటే మించి నగదును ఏటీఎంలో విత్‌డ్రా చేయాలంటే ఖాతాదారులు తప్పనిసరిగా మొబైల్‌ను ఏటీఎం సెంటర్‌కు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఏటీఎం కార్డు పెట్టి పిన్ నంబర్ ఎంటర్ చేయగానే ఖాతాతో అనుసంధానం చేసుకున్న మొబైల్ నంబర్‌కు నాలుగు అంకెల ఓటీపీ వస్తుంది. దానిని ఏటీఎంలో ఎంటర్ చేస్తేనే డబ్బులు డ్రా చేసుకునే వీలుంటుంది. ఈ ఓటీపీ ఒక లావాదేవీకి మాత్రమే పరిమితం. కాగా త్వరలో చాలా బ్యాంకులు ఎస్‌బీఐ బాటలోనే ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రా చేయడంపై ఈ పద్ధతిని అమలు చేయనున్నాయి. అటు సోషల్ మీడియా, ఇతర ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా SBI ఎప్పటికప్పుడు ఏటీఎంలలో జరిగే మోసాలపై కస్టమర్లకు అవగాహన కల్పిస్తోంది. తాము సూచించిన విధంగా ఎస్‌బీఐ సేవలను పొందాలని విజ్ఞప్తి చేస్తోంది.