బీజేపీ ఎంపీ బండి సంజయ్ కి కొనసాగే అర్హత లేదు అని సివిల్ సప్లై కార్పోరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ అన్నారు. కోర్టు జరిమానా వేసింది.. సంజయ్ వెంటనే రాజీనామా చేయాలి అని ఆయన డిమాండ్ చేశారు. బండి సంజయ్ బతుకే బ్లాక్ మెయిల్ బతుకు.. కోర్టు కేసు వేసి అటెండ్ కావు.. గ్రానైట్ వాళ్లపై ఫిర్యాదులు చేస్తావు వసూళ్లు చేసి రాజీ పడతావు అంటూ సర్దార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ ఓట్ల కోసం వస్తే ప్రజలు తరిమికొడతారు అని ఆయన విమర్శలు గుప్పించారు.
Read Also: PPF Scheme: పీపీఎఫ్‌లో సూపర్ స్కీమ్.. నెలకు రూ.5 వేలతో, రూ.42 లక్షలు పొందవచ్చు..
కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం లేని వాళ్ళు ఎమ్మెల్యే టికెట్ కి అప్లై చేస్తారు అంటూ సర్దార్ రవీందర్ సింగ్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ దరఖాస్తులు అమ్ముకునే దుస్థితికి చేరింది.. ఎన్నికలు రాగానే కలెక్షన్ సెలెక్షన్ ఎలెక్షన్ అనే పద్ధతి కాంగ్రెస్ పార్టీది అంటూ ఆయన విమర్శించారు. సివిల్ సప్లై కార్పోరేషన్ ఛైర్మెన్ కాగానే కార్పొరేటర్ కి రాజీనామా చేద్దాం అనుకున్న సీఎం కేసీఆర్ వద్దన్నారు అని సర్దార్ రవీందర్ సింగ్ తెలిపారు. మేకిన్ ఇండియా.. డిజిటల్ ఇండియా అన్నప్పుడు ప్రధాని నరేంద్ర మోడీకి భారత్ గుర్తు రాలేదు.. సీఎం కేసీఆర్ భారత్ రాష్ట్ర సమితి అని పార్టీ పేరు పెట్టడంతో భారత్ అని మోడీ అంటున్నాడు అంటూ ఆయన ఆగ్రహ వ్యక్తం చేశారు. ఇలాంటి వారికి ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలని సర్థార్ రవీందర్ సింగ్ అన్నారు.
Read Also: Lavanya Tripathi: మెగా కోడలికి జోడీగా బిగ్ బాస్ విన్నర్.. బ్రేక్ లేకుండా షూట్?