కోలీవుడ్ స్టార్ కమెడియన్ సంతానం తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. తమిళ స్టార్ హీరోల సినిమాల్లో ఎక్కువగా నటించాడు.. ప్రస్తుతం హీరోగా వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు చిత్రాలు ఉన్నాయి. ఇటీవలే హీరోగా వడక్కుపట్టి రామస్వామి చిత్రంలో నటించాడు ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. ఇప్పటికి సినిమాకు క్రేజ్ తగ్గలేదు..
ఇక ప్రస్తుతం ఇంగ నాన్ తాన్ కింగ్ అనే సినిమా చేస్తున్నాడు.. కాగా గత ఐదేళ్లు క్రితం సంతానం నటించి హిట్ మూవీ ఏ1. తమిళంలో రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది.. ఆ సినిమా ఇప్పుడు ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తుంది..అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. కానీ ఏ1 చిత్రం చూడాలంటే మాత్రం డబ్బులు చెల్లించాల్సిందే. రెంటల్ విధానంలో తెలుగు వర్షన్ రిలీజ్ చేశారు. ఈ సినిమాను మీరు చూడాలంటే అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు రూ.79 చెల్లించాల్సిందని తెలుస్తుంది..
ఈ సినిమాను కోలివుడ్ నూతన దర్శకుడు జాన్సన్ కే తెరాకెక్కించారు.. రొమాంటిక్, కామెడీ ఏంటర్టైనర్ గా ఈ సినిమాను రూపోందించారు.. ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్లలో రిలీజైన ఈ మూవీ చక్కటి వసూళ్లను దక్కించుకున్నది. సంతానం కామెడీ టైమింగ్‌తో అభిమానులను అలరించాడు. స్టార్ హీరోల సినిమాలతో పోటీపడి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల్ రాబట్టింది.. తమిళ్ వర్షన్ ఆల్రెడీ స్ట్రీమింగ్ అవుతుంది..