దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు 135 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది. టీ20 ఫార్మాట్‌లో టీమిండియా సాధించిన అతిపెద్ద విజయాల్లో ఇదొకటి. టీమ్ ఇండియా ఈ విజయంలో సంజూ శాంసన్, తిలక్ వర్మ, అర్ష్‌దీప్ సింగ్ అద్భుత ప్రదర్శన చేశారు. దక్షిణాఫ్రికాతో జరిగిన 4వ టీ20 మ్యాచ్‌లో సంజూ శాంసన్, తిలక్ వర్మ, అర్ష్‌దీప్ సింగ్‌లు టీమిండియా విజయంతో మెరిశారు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఖాతా తెరవకుండానే అవుట్ అయిన తర్వాత, దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో T20 మ్యాచ్‌లో సంజూ శాంసన్ బలమైన పునరాగమనం చేసి 109 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. టీ20 క్రికెట్‌లో సంజూ శాంసన్‌కి ఇది మూడో సెంచరీ. సంజూ శాంసన్ మాత్రమే కాదు, తిలక్ వర్మ కూడా 120 పరుగుల బలమైన ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరి విధ్వంసకర బ్యాటింగ్‌తో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 1 వికెట్ నష్టానికి 283 పరుగుల భారీ స్కోరు సాధించింది. దీంతో దక్షిణాఫ్రికా జట్టు 18.2 ఓవర్లలో 148 పరుగులకే పరిమితమై భారత్ 135 పరుగుల తేడాతో విజయం సాధించింది.
READ MORE: Police Notice: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు పోలీసుల నోటీసులు..
అయితే.. సూర్యకుమార్ యాదవ్ మహేంద్ర సింగ్ ధోని ప్రారంభించిన సంప్రదాయాన్ని కొనసాగించి జట్టులోని ఇద్దరు సరికొత్త ఆటగాళ్లకు ట్రోఫీని అందజేసాడు. మహీ తన కెప్టెన్సీలో చాలా సంవత్సరాల క్రితం ఈ ట్రెండ్‌ను ప్రారంభించాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా తర్వాత ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ కూడా దీనిని ముందుకు తీసుకువెళుతున్నాడు. సౌతాఫ్రికాలో సిరీస్ గెలిచిన తర్వాత సూర్య ట్రోఫీని రమణదీప్ సింగ్, విజయ్‌కుమార్ వ్యాషాక్‌లకు అందజేశాడు. రమణదీప్‌కు సిరీస్‌లోని చివరి రెండు మ్యాచ్‌లు ఆడే అవకాశం లభించింది. అయితే విజయ్‌కుమార్ ఈ సిరీస్‌లో అరంగేట్రం చేయలేకపోయాడు. టీమిండియా విజయోత్సవ వేడుకకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
#TeamIndia seal series victory in style yet again! 🏆🇮🇳#SAvIND #JioCinema #Sports18 #ColorsCineplex #JioCinemaSports pic.twitter.com/rvablJshgs
— JioCinema (@JioCinema) November 15, 2024