ఖమ్మం సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామంలో సీతారామ ప్రాజెక్టు కెనాల్ భూనిర్వాసితుల సన్మాన సభలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్క బుగ్గపాడు గ్రామానికే అభివృద్ధి కోసం 6 కోట్ల 30 లక్షలు ఇచ్చామని, సత్తుపల్లి నియోజకవర్గం లో అత్యంత ప్రజాదరణ కలిగిన గ్రామం బుగ్గపాడు అని ఆయన అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారామ ప్రాజెక్టు కెనాల్ కు భూ నిర్వసితులకు 8 లక్షలు మాత్రమే వచ్చాయి అదే ఖమ్మం జిల్లా లో బుగ్గపాడు లో 10.50 లక్షలు ఇప్పించిన ఘనత మాదే అని ఆయన అన్నారు. భూ నిర్వాసితుల ఎకౌంటులో డబ్బులు వేసి వెలుగు నింపిన ఘనత కేసిఆర్ దే అని ఆయన అన్నారు.
అంతేకాకుండా.. ‘సీతారామ ప్రాజెక్టు రూప కల్పన చేసిన ఏకైక వ్యక్తి కేసిఆరే కానీ మారేవ్వరు లేరు ఇది మీరందరూ గుర్తుంచుకోవాలి. యే నాయకుడికి రాని ఆలోచన మన కేసిఆర్ కి వచ్చింది. అధికారంలో కాంగ్రెస్ పార్టీ లేదు కాబట్టి ఇప్పుడు ఐదు పధకాలతో మీ ముందుకు వస్తున్నారు వారితో అప్రమత్తంగా ఉండాలి. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్ర లల్లో ఎందుకు అమలు చెయ్యడం లేదు…? 55 పాలించిన కాంగ్రెస్ వాళ్ళు 1000 రూపాయలు పెంక్షన్ ఇచ్చినోళ్ళు ఇప్పుడు నాలుగు వేలు ఇస్తాం అంటున్నారు నమ్మదగనాదేనా….గతంలో ఇవ్వనోళ్ళు ఇప్పుడు ఎలా ఇస్తారు….? కృష్ణా గోదావరి జలాలు అనుసంధానం చేస్తేన్న గొప్ప వ్యక్తి కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు వలనే ఎండుతున్న పంటలకు ఇప్పుడు నీళ్ళు అందుతున్నాయి. అధికారంలో లేని వాళ్ళు అధికారంలోకి వస్తారో రారు తెలియదు కానీ సీతారామ ప్రాజెక్టు నా స్వప్నం అంటున్నారు….అని తుమ్మలపై విమర్శ. సీతరామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు అందించే ఏకైక వ్యక్తి కేసిఆర్ నే. ప్రజల కోసమే పని చెయ్యాటానికే మేమున్నాం.. ఎన్నికలు వస్తున్నాయి అంటే రకరకాల వేషాలతో కొంతమంది మీ ముందుకు వస్తున్నారు వారితో జాగ్రత్త.
ఎప్పుడూ అహంకారంతో దొరతనంతో పని చెయ్యాలేదు మీలో ఒక్కడిగా పనిచేశా. పాలేరు నియోజకవర్గం రాజకీయ జన్మ ఇస్తే సత్తుపల్లి నియోజకవర్గం పునః జన్మ ఇచ్చింది. రుణామఫీ కానీ రైతులు రైతు వేదికల వద్దకు వెళ్ళి నేరుగా వేళ్ళి వ్యవసాయ అధికారికి ఫిర్యాదు చేయ్యండి.ఉన్న లోపాలను సరి చేసుకొని రుణామఫీ పొందండి. కేసీఆర్ అభ్యర్థి గా సత్తుపల్లి లో నేనే..
ఖమ్మం లో కాంగ్రెస్ మీటింగ్ పెట్టుకొని కొట్టుకొవటం తలలు పగలగొట్టుకోవటం మన కల్చర్ కాదు వాళ్ళ కల్చరే. ఎవ్వడు దయ దక్షిణాలతో నేను మూడు సార్లు ఎమ్మెల్యే కాలేదు..మీ ఆశ్శీసులతోనే గెలిచా.. ఇప్పుడు నాలుగోసారి బరిలో ఉన్న మీ ఆశ్శీసులు ఉండాలి… అందరు నాయకులు ఒకవైపు ఉన్నారు…కానీ ప్రజలందరూ నాకు ఆశ్శీసులతో నాలుగోసారి గెలిపిస్తారు. ప్రత్యర్ధులను ఇబ్బంది పెట్టాలని ఎప్పుడూ రాజకీయాలు చేయ్యలేదు కేసిఆర్ ….కేసిఆర్ గొప్ప విజన్ ఉన్న నాయకుడు…కుట్రలు కుతంత్రాలు తెలియదు…కేసిఆర్ కు అండంగా ఉండి గెలిపించాలి.’ అని సండ్ర వెంకట వీరయ్య అన్నారు.