Samsung Galaxy F34 5G Smartphone launched in India with 6000mAh Battery: దక్షిణ కొరియాకు చెందిన మొబైల్ దిగ్గజ సంస్థ ‘శాంసంగ్’ భారతదేశంలో మరో మిడ్-రేంజ్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. గత నెలలో శాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ (Samsung Galaxy M34 5G) స్మార్ట్‌ఫోన్‌ను లాంఛ్ చేసిన శాంసంగ్.. ఇప్పుడు గెలాక్సీ ఎఫ్ సిరీస్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎఫ్34 5జీ (Samsung Galaxy F34 5G)ని తీసుకొచ్చింది. ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌లో అద్భుత ఫీచర్స్ ఉన్నాయి. ఈ కొత్త ఫోన్ భారత మార్కెట్‌లో ఉన్న షావోమీ, రియల్‌మీ, వన్‌ప్లస్ నార్డ్ సిరీస్ స్మార్ట్‌ఫోన్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.
Samsung Galaxy F34 5G Price:
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్34 5జీ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో రిలీజ్ అయింది. భారత మార్కెట్‌లో 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 18,999గా ఉంది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 20,999గా ఉంది. ఎలక్ట్రిక్ బ్లాక్, మిస్టిక్ గ్రీన్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్, శాంసంగ్ వెబ్‌సైట్లలో ఈ ఫోన్స్ ప్రీ ఆర్డర్స్ ప్రారంభం అయ్యాయి. ఆగస్టు 11 నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.
Samsung Galaxy F34 5G Offers:
ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి నోకాస్ట్ ఈఎంఐ ద్వారా శాంసంగ్ గెలాక్సీ ఎఫ్34 5జీ స్మార్ట్‌ఫోన్ కొనొచ్చు. కేవలం రూ. 2,111 నుంచి నోకాస్ట్ ఈఎంఐ ప్రారంభం అవుతుంది. ఐసీఐసీఐ, కొటక్ బ్యాంక్ కార్డులపై రూ. 2,000 డిస్కౌంట్ ఆఫర్ లభిస్తుంది. ఈ ఆఫర్‌తో 6జీబీ, 128జీబీ వేరియంట్ రూ. 16999కు.. 8జీబీ, 128జీబీ వేరియంట్ రూ. 18999 ధరకు మీకు అందుబాటులో ఉంటాయి.
Also Read: Peddireddy Ramachandra Reddy: వాలంటీర్లపై బురద చల్లడానికే చంద్రబాబు ఆరోపణలు
Samsung Galaxy F34 5G Features:
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్34 5జీ 6.46 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేటు, కార్నింగ్ గొరిల్లా 5 ప్రొటెక్షన్‌తో ఈ డిస్‌ప్లే వస్తోంది. ఇందులో ఆక్టాకోర్ ఎగ్జినోస్ 1280 ప్రాసెసర్ ఉండగా.. ఆండ్రాయిడ్ 13తో పనిచేసే వన్ యూఐ 5.1 ఇచ్చారు. 50 ఎంపీ బ్యాక్ కెమెరా, 13 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. వాటర్ డ్రాప్ స్టయిల్ నాచ్‌తో వస్తున్న ఈ ఫోన్‌లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. పవర్ ఫుల్ 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ ఫోన్ వస్తుంది.