BJP: ‘‘ఓట్ చోరీ జరిగితే మేం ఎలా ఓడిపోయాం’’.. కాంగ్రెస్‌కు బీజేపీ కౌంటర్..
- SIRపై విపక్షాల “ఓట్ చోరీ” ఆరోపణలకు సంబిత్ పాత్రా కౌంటర్..
- బెంగాల్లో అత్యధిక ఓట్ల తొలగించిన స్థానాల్లో బీజేపీ ఓడిపోయిందని కామెంట్స్..
- కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు గెలవలేకే ఇలాంటి ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: కేంద్రం ఎన్నికల సంఘంపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో బీజేపీ ప్రతిపక్షాలపై ప్రతిదాడికి దిగింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)పై ఎన్నికల కమిషనర్లలో విభేదాలు ఏర్పడినట్లు వచ్చిన నివేదికపై ప్రతిపక్షాలు ఎన్నికల సంఘం, బీజేపీని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించాయి. ఈ నేపథ్యంలో బీజేపీ అధికా ప్రతినిధి సంబిత్ పాత్ర మాట్లాడుతూ.. 2014లో ప్రధాని నరేంద్రమోడీ మోడీ అధికారంలోకి వచ్చిప్పటి నుంచి దేశ ప్రజలు ప్రతిపక్షాలను నిరంతరం తిరస్కరిస్తూనే వస్తున్నారని సంబిత్ పాత్ర అన్నారు. కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు ప్రజల మద్దతు పొందడంలో విఫలమవుతూ ఉన్నాయని అన్నారు. దీంతోనే దేశ రాజ్యాంగ సంస్థలపై వ్యవస్థీకృత దాడులకు పాల్పడుతున్నాయని ఆరోపించారు.
‘‘ఓట్ చోరీ’’ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్, ప్రతిపక్షాల తీరుపై ఆరోపించారు. ఓట్ల తొలగింపుతో బెంగాల్లో బీజేపీ లాభపడిందనే ప్రతిపక్షాల వాదనల్ని సంబిత్ పాత్ర తిరస్కరించారు. అత్యధిక ఓటర్ల పేర్లు తొలగించిన 20 అసెంబ్లీ స్థానాల్లో సగానికి పైగా బీజేపీ గెలవలేదనే విషయాన్ని గుర్తుచేశారు. అత్యధిక పేర్లు తొలగించబడిన 20 నియోజకవర్గాల్లో 13 స్థానాల్లో టీఎంసీ గెలిచిందని, 6 స్థానాల్లో బీజేపీ, ఒక స్థానంలో కాంగ్రెస్ గెలిచిందని అన్నారు. ఓట్ చోరీ నిజంగా జరిగితే బీజేపీ సగం స్థానాల్లో ఎందుకు ఓడిపోయిందని ప్రశ్నించారు.
Also Read
- Bombay High Court: మత ఊరేగింపుల్లో బాణసంచా కాల్చొద్దు.. డీజేలు, లేజర్ బీమ్స్పై బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు
- RSS: ఆర్ఎస్ఎస్, హిజ్బుల్ ముజాహిదీన్ ఒకటే.. కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు..
- IMEC: IMECతో ఇరాన్‌కు చెక్.. భారత కారిడార్‌కు ట్రంప్ మద్దతు..
- BJP: స్మృతి ఇరానీకి మళ్లీ ప్రమోషన్.. యూపీ సహా పలు రాష్ట్రాలకు కొత్త ఇంఛార్జ్‌లు నియామకం
ఎన్నికల సంఘంలో కమిషనర్ల మధ్య విభేదాలు వచ్చాయనే రిపోర్టుపై సంబిత్ పాత్ర స్పందిస్తూ.. కమిషనర్ల మధ్య అధికారిక చర్చలు, అభిప్రాయ బేధాలు ఉండటం ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగమని అన్నారు. దీనికి ముందు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదికలో.. ఎస్ఐఆర్ ప్రక్రియపై ఇద్దరు కమిషనర్లు పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారని పేర్కొంది. దీంతో వివాదం మొదలైంది. అయితే, ఈ రిపోర్టుపై ఈసీ స్పందిస్తూ.. తుది నిర్ణయాలు అన్నీ ముగ్గురు కమిషనర్లు ఏకగ్రీవ ఆమోదంతోనే తీసుకున్నామని తెలిపింది.
తాజావార్తలు
-
BJP: ‘‘ఓట్ చోరీ జరిగితే మేం ఎలా ఓడిపోయాం’’.. కాంగ్రెస్‌కు బీజేపీ కౌంటర్..
-
Ellipaya Karam: నానమ్మల నాటి నాటు రుచి.. జ్వరం, జలుబును తరిమికొట్టే ఎల్లిపాయ కారం సింపుల్ ఇలా చేసేయండి!
-
Nani Wife : ఆరోజు మార్నింగ్ షో కూడా పడలేదు.. 16 ఏళ్ల కష్టానికి సాక్షిని నేనే.. నాని భార్య ఎమోషనల్
-
Bombay High Court: మత ఊరేగింపుల్లో బాణసంచా కాల్చొద్దు.. డీజేలు, లేజర్ బీమ్స్పై బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు
-
AP Cabinet Key Decisions: కేబినెట్ కీలక నిర్ణయాలు.. నాలుగు కొత్త కమిషనరేట్లకు గ్రీన్‌సిగ్నల్.. వాటికి ఆమోదం..
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!