IMEC: IMECతో ఇరాన్‌కు చెక్.. భారత కారిడార్‌కు ట్రంప్ మద్దతు..
- మరోసారి వార్తలోకి ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్(IMEC) ఇరాన్ యుద్ధం నేపథ్యంలో IMECపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IMEC: ఇరాన్ యుద్ధం వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘‘ఇండియా–మిడిల్ ఈస్ట్–యూరప్ ఎకనామిక్ కారిడార్ (IMEC)’’ మద్దతు తెలిపారు. ఇరాన్‌పై ఆధారపడకుండా ప్రత్యామ్నాయ ఇంధన రవాణా మార్గాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమవేశాల సందర్భంగా గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్, అరబ్ దేశాల నేతలతో జరిగిన సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ దాడులు చేస్తు్న్న క్రమంలో, ఇరాన్ నియంత్రణలో ఉన్న మార్గాల నుంచి దూరంగా వెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
IMEC అంటే ఏమిటి.?
ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్‌ను 2023 సెప్టెంబర్‌లో న్యూఢిల్లీలో జరిగిన G20 సదస్సు సమయం భారత్, అమెరికా, సౌదీ అరేబియా, యూఏఈ, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యూరోపియన్ యూనియన్ కలిసి దీనిని ప్రతిపాదించాయి. భారత్, గల్ఫ్ ప్రాంతాలను యూరప్ మధ్య రవాణా, వాణిజ్యం, ఇంధనం, డిజిటల్ కనెక్టివిటీని బలోపేతం చేయాలని నిర్ణయించాయి.
Also Read
- Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
- CJP: ‘‘సంతకాలు చేసి ఉల్లంఘించారు’’.. కాక్రోచ్ నేతలను జైలుకు పంపడానికి కారణాలివే.!
- Real Estate Boom: రియల్ ఎస్టేట్‌కు జోష్.. ఇళ్ల ధరల్లో 12 శాతం పెరుగుదల.. కొనుగోలుదారుల చూపు అటువైపే
- CJP: ‘‘దేశాన్ని నాశనం చేస్తున్నారు’’.. అభిజిత్ దీప్కేకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అవమానం..
IMECలో రెండు ప్రధాన మార్గాలు ఉంటాయి. ఒకటి భారత్‌ను గల్ఫ్ దేశాలతో కనెక్ట్ చేయడం, రెండోది గల్ఫ్ దేశాలను యూరప్‌తో అనుసంధానించడం. ఈ ప్రణాళిక మొత్తంలో రైల్వే నెట్వర్క్, షిష్-టూ-రైల్ ట్రాన్సిట్, విద్యుత్, డిజిటల్ కేబుళ్లు, క్లీన్ హైడ్రోజన్ పైప్లైన్లు ఉంటాయి. ఈ కారిడార్ ద్వారా భారత్, యూరప్ వాణజ్య మార్గాన్ని వేగవంతం చేయడంతో పాటు ఇంధన, డిజిటల్ కనెక్టివిటీకి కొత్త అవకాశాలు ఏర్పాటు చేయాలని ప్రణాళిక చేశారు.
ఇరాన్‌కు ప్రత్యామ్నాయ మార్గం ఎందుకు..?
మిడిల్ ఈస్ట్ సంక్షోభం తర్వాత, ఇరాన్ కీలకమైన హార్ముజ్ జలసంధిని నియంత్రిస్తోంది. ఈ మార్గం ద్వారా ప్రపంచానికి సరఫరా అవుతున్న గ్యాస్, చమురు రవాణా దెబ్బతింది. దీంతో ఈ మార్గంపై ఆధారపడటం కన్నా ప్రత్నామ్నాయ మార్గాల్ని ఏర్పాటు చేసుకోవాలని అన్ని దేశాలు యోచిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మరోసారి IMEC కీలకంగా మారింది. 2023లో IMECపై అవగాహన ఒప్పందం మాత్రమే జరిగింది. ఇంకా పనులు ప్రారంభం కాలేదు. ఈలోపే హమాస్ వార్, ఇరాన్ వార్, హౌతీల దాడులతో ఈ ప్లాన్ నిలిచిపోయింది. ఇప్పుడు ట్రంప్ వ్యాఖ్యలతో దీనికి మరోసారి ప్రాధాన్యత ఏర్పడింది.
🚨 President #DonaldTrump has endorsed the India–Middle East–Europe Economic Corridor (#IMEC), calling it a strategic alternative to Iran-controlled routes. The India-led corridor aims to strengthen trade, connectivity, and energy security between Asia, the Gulf, and Europe. pic.twitter.com/Ebggs6nmWA
— SecureOps (@SecureO5) September 23, 2026
తాజావార్తలు
-
Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
-
Tecno Spark 50s 5G: టెక్నో Spark 50s 5G లాంచ్ డేట్ ఫిక్స్.. iPhone 18 Pro తరహా Burgundy Red కలర్లో కొత్త ఫోన్!
-
Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. కండువా కప్పి ఆహ్వానించిన పవన్.. మేయర్ రేసులో..?
-
CJP: ‘‘సంతకాలు చేసి ఉల్లంఘించారు’’.. కాక్రోచ్ నేతలను జైలుకు పంపడానికి కారణాలివే.!
-
Real Estate Boom: రియల్ ఎస్టేట్‌కు జోష్.. ఇళ్ల ధరల్లో 12 శాతం పెరుగుదల.. కొనుగోలుదారుల చూపు అటువైపే
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..