టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి, ఆమె హిట్ సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే మంచిది విజయాన్ని అందుకుంది.. ఆ తర్వాత ఒక్కో సినిమాతో తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటూ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ అయ్యింది.. స్టార్ హీరోల సరసన నటించి నటిగా ఫెమస్ అయ్యింది… సామ్ ఇటీవల సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.. ఇక సోషల్ మీడియాలో సమంత ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికీ తెలుసు..
సమంత ఈ మధ్య గ్లామర్ డోస్ పెంచేసింది.. హాట్ అందాలతో హీటేక్కిస్తుంది.. తాజాగా సోషల్ మీడియా పై సంచలన వ్యాఖ్యలు చేసింది.. అవి కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఆ పోస్ట్ లో.. సోషల్ మీడియాను తక్కువగా ఉపయోగించవద్దు. అంతర్జాతీయంగా దీన్ని ఎక్కువగా ఉపయోగించండి. మిమ్మల్ని ప్రేరేపించే మరియు ప్రేరేపించే వ్యక్తులను అనుసరించండి. నిపుణులతో నిమగ్నమవ్వడం ద్వారా మీరు నిజమైన, సానుకూల స్నేహాన్ని సృష్టించడం ఇక్కడ నేర్చుకోవచ్చు. తెలివి తక్కువగా ఇక్కడ స్క్రోలింగ్ చేయడం, ఫిర్యాదు చేయడం, ద్వేషించడం మరియు ప్రతికూలతను, తప్పుడు ప్రచారాలను అస్సలు చెయ్యకండి అంటూ రాసుకొచ్చింది.. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.
సామ్ తెలుగుతో పాటుగా తమిళ్, హిందీ ఇండస్ట్రీలో కూడా పలు చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ అయ్యింది.. అలాంటి సమంత ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటూ, సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటుంది.. తన అనారోగ్యల సమస్యల కారణంగా గతంలో సైన్ చేసిన సినిమాలను పూర్తి చేసింది.. ఆ తర్వాత ఏడాది గ్యాప్ తీసుకుంటానని ప్రకటించింది.. అనుకున్న విధంగానే సినిమాలకు దూరం అయ్యింది.. సినిమాలకు దూరంగా ఉన్నా కూడా నిత్యం వార్తల్లో హైలెట్ అవుతుంది.. ప్రస్తుతం సామ్ సిటాడెల్ వెబ్ సిరీస్‌లో నటించింది.