సమంత విజయ్ దేవరకొండకి జంటగా ఖుషి సినిమాలో నటించింది.. దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాను రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. ఈ సినిమా సెప్టెంబర్ 1న ఎంతో గ్రాండ్ గా విడుదల కాబోతుంది.చాలా కాలం తర్వాత సమంత లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో నటిస్తుంది.. ఇటీవల విడుదల అయిన ఖుషి ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.అయితే ఖుషి చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు సమంత అటెండ్ అవ్వలేదు.దీనితో ఈమె పై సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేశారు. ఈ విమర్శలపై స్పందించిన సమంత… ఇతరుల కోసం బ్రతకొద్దు. మీ స్థాయిని పెంచుకోండి అంటూ పరోక్షంగా కామెంట్స్ చేసింది.. ఖుషి మూవీ తప్పకుండా విజయం సాధిస్తుందని సమంత ఎంతో ధీమాగా ఉంది.మరోవైపు ఈ భామ నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది.
సిటాడెల్ కోసం సమంత ఎంతో కష్టపడింది. కష్టతరమైన యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొంది. ఆ యాక్షన్ సన్నివేశాలు చేసేటప్పుడు సమంతకు స్వల్ప గాయాలు కూడా అయ్యాయి. సిటాడెల్ అనేది ఒక ఇంటర్నేషనల్ సిరీస్. ఇంగ్లీష్ వెర్షన్ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటించారు. దాని ఇండియన్ వెర్షన్ లో సమంత నటిస్తున్నారు. సిటాడెల్ సిరీస్ కు ది ఫ్యామిలీ మాన్ ఫేమ్ రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సిరీస్ లో వరుణ్ ధావన్-సమంత ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.. గతంలో సమంత ది ఫ్యామిలీ మాన్ 2 అనే వెబ్ సిరీస్ లో నటించిన విషయం తెలిసిందే.అయితే ప్రస్తుతం సమంత ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ తీసుకుంది.. చికిత్స కోసం అమెరికా వెళ్లనున్న సమంత ఆ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఈ భామ విరామ సమయాన్ని ఎంతో ఆనందంగా గడుపుతుంది. తన స్నేహితులతో వెకేషన్ కు వెళ్లి అక్కడ దిగిన ఫోటోలను తన ఫ్యాన్స్ కు షేర్ చేస్తుంది.తాజాగా సమంత స్టైలిష్ లుక్ లో కనిపించి సోషల్ మీడియాను షేక్ చేసింది. గాగుల్స్, షర్ట్, ప్యాంట్స్ లో ఎంతో స్టైలిష్ గా దర్శనమిచ్చింది. సమంత లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.