టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తెరపై కనిపించి చాలా కాలం అవుతుంది. తాజాగా నిర్మాతగా మారిన సామ్ ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద ‘శుభం’ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాకు ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. వివేక్ సాగర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, క్లింటన్ సెరెజో సంగీతం అందిస్తున్న ఈ మూవీ మే 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో మూవీ టీం తో కలిసి సామ్ వరుస ప్రమోషన్స్ చేస్తుంది. ఏ చిన్న ఈవెంట్‌ని కూడా వదలడం లేదు. ఇక ఈ ‘శుభం’ మూవీలో సమంత కూడా అతిథి పాత్రలో నటింన విషయం తెలిసిందే. అయితే ఆమె నటించడానికి బలమైన కారణం ఉందట.
Also Read : Manchu Lakshmi : నా లైఫ్ లో మనోజ్ ఒక ఇరిటేటింగ్ ఫెలో..
రీసెంట్‌గా మీడియాతో ముచ్చటించిన సామంత ఈ విషయం గురించి చెప్పుకోచ్చింది.. ‘నటిగా ఓ శుక్రవారం ఎలా ఉంటుందో నాకు అనుభవం ఉంది. కానీ నిర్మాతగా ఇది నా మొదటి సినిమా. గత వారం రోజులుగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను. పోస్ట్ ప్రొడక్షన్ టీం, మిక్సింగ్ టీం, ఎడిటింగ్ ఇలా అందరూ నిద్ర లేకుండా పని చేస్తున్నారు. ‘శుభం’ చిత్రం చాలా బాగా వచ్చింది. కెరీర్ మొదలు పెట్టి దాదాపు 15 ఏళ్లు అయింది. నాకు కొంత అనుభవం ఉంది కాబట్టి ప్రొడక్షన్ కంపెనీ ప్రారంభించాను. ఎలాంటి హడావుడి లేకుండా సినిమాను ప్రారంభించాం 8 నెలల్లో పూర్తి చేశాం. ఇక నేను ‘శుభం’ లో అతిథి పాత్ర పోషించాల్సింది కాదు. కానీ నిర్మాతగా నా తొలి చిత్రం కోసం నేను ఎవరినీ సాయం అడగాలనుకోలేదు. అందుకే నేనే నటించాను. సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లే బాధ్యత కూడా నా మీద ఉంది. రిలీజ్ వరకు మాత్రమే ప్రచారం చేస్తాను. తర్వాత సినిమా పూర్తిగా ప్రేక్షకుల చేతుల్లో ఉంటుంది’ అని చెప్పుకొచ్చింది సమంత.