బస్సులో గుండెపోటుతో మరణించిన ప్రయాణికుడి మృతదేహాన్ని అదే బస్సులో బాధితుడి ఇంటికి తరలించిన మహబూబాబాద్ డిపో కండక్టర్, డ్రైవర్‌ను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ అభినందించారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ ప్రయాణికులు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకునేలా చూడాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందన్నారు. సిబ్బంది అత్యుత్తమ పనితీరు కనబరిచి మెరుగైన సేవలందించడంతోపాటు మానవత్వాన్ని చాటుకుంటున్నారని అభినందించారు.
Also Read : Esshanya Maheshwari Hot Pics: ఫ్రంట్ అండ్ బ్యాక్ పోజులతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఈశాన్య మహేశ్వరి!
బస్సులో గుండెపోటుతో మృతి చెందిన ప్రయాణికుడి మృతదేహాన్ని అదే బస్సులో బాధితుడి ఇంటికి తరలించిన మహబూబాబాద్ డిపో కండక్టర్ కె.నాగయ్య, డ్రైవర్ డి.కొమురయ్యలను ఆయన అభినందించారు. విధులు నిర్వర్తించే సమయంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు స్పందించే సామర్థ్యం సిబ్బందికి అవసరమన్నారు. జూన్ 14న ఖమ్మం నుంచి మహబూబాబాద్‌కు బస్సులో వెళ్తుండగా కె.హుస్సేన్ (52) అనే ప్రయాణికుడికి గుండెపోటు వచ్చింది. అంబులెన్స్ సిబ్బంది హుస్సేన్ మృతదేహాన్ని అతని ఇంటికి తరలించడానికి నిరాకరించారు. ఆ సమయంలో నాగయ్య, కొమురయ్యలు ఉన్నతాధికారుల అనుమతితో బంధువుల సహకారంతో మృతదేహాన్ని ఆర్టీసీ బస్సులో హుస్సేన్ ఇంటికి తరలించారు.