Sajjala Ramakrishna Reddy: ఉద్దానం సమస్యకు శాశ్వత పరిష్కారం చేసింది జగన్ ప్రభుత్వమేనని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. మేం చేసిన పనులపై చంద్రబాబు అభూత కల్పనలు చేస్తున్నారని తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోటి 40 లక్షల కుటుంబాలకు నేరుగా లబ్ధి చేశామన్నారు. గ్రామాల స్వరూపం మారిందని.. 31 లక్షల మంది మహిళలకు ఇళ్ళ స్థలాలు ఇచ్చామన్నారు. వీటిలో ఐదు లక్షలకు పైగా ఇళ్ళ నిర్మాణం పూర్తి అయ్యిందని సజ్జల వెల్లడించారు. 16 లక్షల కోట్లతో స్కూళ్లల్లో నాడు – నేడు ద్వారా కార్పొరేట్ స్కూళ్ళల్లా మారాయన్నరు. చంద్రబాబుకు తలకాయ ఉండి ఆ లేఖలు రాస్తున్నాడా?.. 22 లక్షల ఎకరాల్లో పంట నష్టం అని ఏ ప్రాతిపదికన చంద్రబాబు చెబుతున్నాడని ఆయన మండిపడ్డారు. బాధ్యత ఉన్న నాయకుడు ఇలా చేస్తారా అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి గా పని చేసిన చంద్రబాబుకు పంట నష్టం అంచనాలు ఎలా వేస్తారో తెలియదా అంటూ ప్రశ్నలు గుప్పించారు.
Read Also: CM YS Jagan: ఏపీలో ఎన్నికల తేదీలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
సజ్జల మాట్లాడుతూ.. “ఏడాదిలో 300 రోజులకు పైగా హైదరాబాద్‌లో ఉంటావ్.. గెస్ట్ లాగా ఇక్కడికి వస్తాడు.. మూడు నెలల్లో ఎలా వస్తాడు… ఎక్కడికి వస్తాడు??. ప్రజామోదం చంద్రబాబుకే లేదు. 2019లోనే రాష్ట్ర ప్రజలు చంద్రబాబును తిరస్కరించారు. ఐదేళ్ళ పాలనలో ఏమీ చేయకపోవడమే కాదు ప్రజలను రాచి రంపాన పెట్టాడు. చంద్రబాబు క్షుద్ర పూజలు, తాంత్రిక పూజలు చేస్తున్నాడనే అనుమానం ఉంది. గతంలోనూ క్షుద్రపూజలు చేశాడు. మా అభ్యర్థుల మార్పుపై చంద్రబాబు అవాకులు, చవాకులు పేలుతున్నాడు. బీసీ స్థానాల్లో చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ ఎందుకు పోటీ చేస్తున్నారు?. ఏం చేయాలో మా పార్టీకి స్పష్టత ఉంది. కొత్తగా రాజకీయాల్లోకి రాలేదు. కుప్పంతో సహా టీడీపీ గెలిచే స్థానం ఒక్కటీ లేదు. ఓటమి ఖాయం అని తెలిసి దానికి ఒక వంకను వెతుక్కుంటున్నాడు.” అని సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు.