ద్దానం సమస్యకు శాశ్వత పరిష్కారం చేసింది జగన్ ప్రభుత్వమేనని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. మేం చేసిన పనులపై చంద్రబాబు అభూత కల్పనలు చేస్తున్నారని తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోటి 40 లక్షల కుటుంబాలకు నేరుగా లబ్ధి చేశామన్నారు. గ్రామాల స్వరూపం మారిందని.. 31 లక్షల మంది మహిళలకు ఇళ్ళ స్థలాలు ఇచ్చామన్నారు.