Ruhani Sharma Reveals Her Relationship With Virat Kohli: ‘చిలసౌ’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన హీరోయిన్ ‘రుహానీ శర్మ’. హిట్, డర్టీ హరి, 101 జిల్లాల అందగాడు, హర్-చాఫ్టర్1 సినిమాలతో తెలుగు అభిమానులకు దగ్గరయ్యారు. రుహానీ తెలుగులోనే కాకుండా తమిళ్, హిందీ భాషల్లోనూ హీరోయిన్‌గా నటిస్తున్నారు. తాజాగా విక్టరీ వెంకటేశ్ ‘సైంధవ్’ సినిమాలో రుహానీ శర్మ కీలక పాత్ర చేశారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది. అయితే తాజాగా ఓ షాప్ ఓపెనింగ్ కోసం వచ్చిన రుహానీ.. సైంధవ్ సినిమా సహా తన పర్సనల్ విషయాలను పంచుకున్నారు.
ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ మాట్లాడుతూ.. అనుష్క శర్మ మీకు సిస్టర్ అవుతుంది, విరాట్ కోహ్లీ బావ అవుతాడు? కదా అని రుహానీ శర్మను ప్రశ్నించారు. ‘నిజమే, ఇది టాప్ సీక్రెట్. నా పర్సనల్ విషయాలను ఎప్పుడు నేను చెప్పలేదు. ఈ విషయం మీకు ఎలా తెలిసింది?. మీరు అడిగారు కాబట్టి చెబుతున్నా. అనుష్క శర్మ నాకు సిస్టర్ అవుతుంది. విరాట్ కోహ్లీ బావ అవుతారు. విరాట్ నాతో చాలా బాగుంటారు. ఇద్దరూ అందరితో బాగుంటారు. వాళ్లిద్దరూ చాలా సింపుల్‌గా ఉంటారు. అది నాకు బాగా నచ్చుతుంది’ అని రుహానీ శర్మ జవాబిచ్చారు.
Also Read: Air Canada Plane: విమానం క్యాబిన్ తలుపు తెరిచి.. కిందకు దూకేసిన ప్రయాణికుడు!
సైంధవ్ సినిమా గురించి మాట్లాడుతూ… ‘నేను చిన్నప్పటినుంచి వెంకీ సర్ సినిమాలు చూస్తూ పెరిగాను. సైంధవ్ సినిమాలో నటించాక ఆయనకు ఇంకా పెద్ద ఫ్యాన్ అయ్యాను. వెంకటేష్ గారితో సినిమా చేయడం సంతోషంగా ఉంది. చిన్నప్పటి నుంచి నాకు డాక్టర్ అవ్వాలనే కోరిక ఉండేది. అయితే సినిమాల్లోకి రావడంతో అది కుదరలేదు. ఇప్పుడు సైంధవ్‌లో డాక్టర్ పాత్ర పోషించడం సంతోషంగా ఉంది’ అని రుహానీ శర్మ చెప్పారు. ఇదంతా రుహానీ తెలుగులోనే మాట్లాడడం విశేషం.