Ek Din: సాయి పల్లవి ‘ఏక్ దిన్’ ట్రైలర్.. ఒక్క రోజు ప్రేమ కోసం హీరో పోరాటం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌత్ ఇండియాలో తన నటనతో, డాన్స్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న సాయి పల్లవి, ఇప్పుడు బాలీవుడ్ జెండా పాతేందుకు సిద్ధమైంది. అమీర్ ఖాన్ వారసుడు జునైద్ ఖాన్ హీరోగా పరిచయమవుతున్న ‘ఏక్ దిన్’ చిత్రంతో ఆమె హిందీ వెండితెరకు పరిచయమవుతోంది. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తోంది. ట్రైలర్ చూస్తుంటే, సాయి పల్లవి ఇందులో ఒక అరుదైన వ్యాధితో బాధపడే యువతిగా కనిపిస్తోంది. ఆమెను ప్రాణంగా ప్రేమించే హీరో (జునైద్), ఆమెతో కనీసం ‘ఒక్క రోజు’ అయినా ప్రేమగా గడపాలని కోరుకుంటాడు.
Also Read : Satyadev: మహేష్ బాబుతో సీన్ చేశానని ఊరంతా చెప్పిన.. కానీ కట్ చేస్తే..!
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్‌కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
ఆ ఒక్క రోజు వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చింది? విధిని ఎదిరించి వారి ప్రేమ ఎలా గెలిచింది? అనే పాయింట్‌ను దర్శకుడు సునీల్ పాండే ఎంతో సున్నితంగా ఆవిష్కరించినట్లు తెలుస్తోంది. సాయి పల్లవి తన నేచురల్ యాక్టింగ్‌తో హిందీ ఆడియెన్స్‌ను కూడా మంత్రముగ్ధులను చేయడం ఖాయమనిపిస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘ఒక రోజు’ పేరుతో విడుదల చేస్తున్నారు. అమీర్ ఖాన్ స్వయంగా మన్సూర్ ఖాన్, అపర్ణ పురోహిత్‌లతో కలిసి ఈ భారీ ప్రాజెక్టును నిర్మించారు. రామ్ సంపత్ అందించిన సంగీతం ట్రైలర్‌కు ప్రాణం పోసింది. మే 01న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సాయి పల్లవి నటిస్తున్న తొలి హిందీ సినిమా కావడంతో తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!