తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కొనసాగుతున్న అవకతవకలను అరికట్టేందుకు అవినీతి నిరోధక శాఖ (ACB) పెద్ద ఎత్తున ఆకస్మిక దాడులు నిర్వహించింది.
CM Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో అత్యంత సంచలనం సృష్టిస్తున్న ఈ ఫార్మాలా కేసు అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి కేటీఆర్‌ను అరెస్టు చేయాలన్నా, ఆయనపై చార్జిషీట్ దాఖలు చేయాలన్నా.. గవర్నర్ అనుమతి తప్పనిసరి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేటీఆర్ విచారణకు ఇప్పటికే గవర్నర్ అనుమతి ఇచ్చినా.. చార్జిషీట్‌కు మాత్రం ఇంకా ఆమోదం లభించలేదన్నారు. 2018లో ‘ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్’ కు చేసిన…
Corruption Case: భారీగా అక్రమాస్తులు, నగదు, బంగారంతో పాటు లంచాలు డిమాండ్ చేసిన కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ఓ భారీ లంచకోండి అధికారిని అరెస్ట్ చేసింది. పంజాబ్ లోని రూప్‌నగర్ రేంజ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (DIG)గా పనిచేస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారి హర్చరణ్ సింగ్ భుల్లర్ (2009 బ్యాచ్)ను అవినీతి కేసులో సీబీఐ అరెస్టు చేసింది. మొదట రూ.8 లక్షల లంచం డిమాండ్‌తో మొదలైన ఈ కేసు దర్యాప్తులో ఏకంగా రూ.5…
Supreme Court: భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) బీఆర్ గవాయ్, జస్టిస్ కే వినోద్ చంద్రన్ లతో కూడిన ధర్మాసనం ఈడీపై విరుచుకుపడింది. మంగళవారం సుప్రీంకోర్టులో తమిళనాడు ప్రభుత్వం వర్సెస్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) పిటిషన్‌ను విచారణకు వచ్చింది. రూ.1,000 కోట్ల కుంభకోణానికి సంబంధించి తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ (TASMAC) అధికారుల ప్రాంగణాలపై ఈడీ దాడులు చేసింది. ఈ దాడులను సవాలు చేస్తూ.. ఈడీ చర్యలపై స్టే ఇవ్వాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
హైదరాబాద్ నగరంలో జరిగిన ఫార్ములా ఈ కార్ రేస్‌లో అవకతవకలపై ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ రేస్‌లో అవినీతి జరిగిందని ఆరోపణలు రావడంతో ఏసీబీ గత తొమ్మిది నెలలుగా విచారణ జరిపింది.
Karnataka: కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలోని కర్ణాటక గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి లిమిటెడ్ (KRIDL)లో అటెండర్ గా పని చేసిన కలకప్ప నిడగుండి ఇంట్లో లోకాయుక్త సోదాలు చేసింది. ఈ తనిఖీల్లో రూ.30 కోట్లకు పైగా ఆస్తులు బయటపడ్డాయి.
KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్)కు అవినీతి నిరోధక శాఖ (ACB) మరోసారి నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ రేసు కారు కేసులో ఆయనను జూన్ 16వ తేదీన ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని కోరారు. ఇదే కేసులో ఇది కేటీఆర్‌కు రెండోసారి నోటీసులు కావడం గమనార్హం. ACB ఇప్పటికే మే 26వ తేదీన హాజరుకావాలని నోటీసులు ఇచ్చినప్పటికీ, కేటీఆర్ అప్పటికే విదేశీ పర్యటనలో ఉండటంతో విచారణకు హాజరు కాలేకపోయారు.…
ఏపీపీఎస్సీలో అవకతవకలు కేసులో అరెస్టు అయిన సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు అస్వస్థతతకు గురైనట్లు తెలిసింది. జిల్లా జైలులో రిమాండ్ ఖైదీ గా ఉన్న సీఎస్సార్‌కు ఉదయం బిపీ హెచ్చు తగ్గులు రావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎకో తీయించడంతో గుండె సంబంధిత ఇబ్బంది ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. గుండె జబ్బులకు సంబంధించి స్పెషల్ వార్డులో పీఎస్సార్ ఆంజనేయులును ఉంచారు. ప్రస్తుతం వైద్య సేవలు కొనసాగిస్తున్నారు.
అవినీతి కేసులో సీబీఐ చర్య అనంతరం జమ్మూ కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఆరోగ్యం క్షీణించింది. గురువారం, మాలిక్ సహా 6 మందిపై సీబీఐ అధికారికంగా ఛార్జిషీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఛార్జిషీట్ అనంతరం తాను ఆసుపత్రిలో చేరానని, తన పరిస్థితి చాలా విషమంగా ఉందని మాలిక్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. మాలిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటోను పోస్ట్ చేశారు.