ఓబుళాపురం మైనింగ్ కేసులో తనను సీబీఐ కోర్టు నిర్దోషిగా ప్రకటించడంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కోర్టు తీర్పు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. పన్నెండు న్నరేళ్ల కిందట కోర్టు మెట్లేక్కినట్లు చెప్పారు. ఏ తప్పు చేయకపోయినా కోర్టు మెట్ల ఎక్కాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక రకమైన బాధ ఆరోజు కోర్టు మెట్లు ఎక్కినప్పుడు అనుభవించానన్నారు.
మరో మూడు కేసుల్లో రాజా సింగ్‌ను కోర్టు నిర్దోషిగా తేల్చింది. గతంలో విద్వేషపూరిత ప్రసంగం, ఎన్నికల ర్యాలీ, శ్రీరామ నవమి ర్యాలీ అనుమతి ఉల్లంఘనకు సంబంధించిన మూడు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులను విచారించిన నాంపల్లిలోని ప్రత్యేక కోర్టు బీజేపీ శాసనసభ్యుడు టి. రాజా సింగ్‌ను నిర్దోషిగా ప్రకటించింది. మంగళ్‌హాట్, షాహినాయత్‌గంజ్ పోలీస్ స్టేషన్లలో ఈ కేసులు నమోదయ్యాయి.