Pilgrims returning without visiting Sabarimala: కేరళలోని శబరిమల దేవాలయానికి భక్తులు పోటెత్తారు. అయ్యప్ప స్వామి ఆలయంలో మండల-మకరవిళక్కు పూజలు కొనసాగుతుండడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా భక్తులు తరలివస్తున్నారు. దీంతో శబరిగిరులు అయ్యప్ప భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అయ్యప్ప స్వామి దర్శనానికి 12-18 గంటల సమయం పడుతోంది. అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు క్యూలైన్‌లో భక్తులు వేచి చుస్తున్నారు.
రద్దీ ఎక్కువగా ఉండడంతో గంటల కొద్దీ వరుసల్లో వేచి ఉన్నా.. భక్తులకు అయ్యప్ప దర్శనం కావట్లేదు. దాంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు దర్శనం చేసుకోకుండానే వెనుదిరుగుతున్నారు. కర్ణాటకకు చెందిన భక్తులు పందళంలోని శ్రీధర్మశాస్త ఆలయంలో ఇరుముడి సమర్పించి.. అయ్యప్పకు నెయ్యి అభిషేకం చేసి వెనక్కి వెళ్లిపోతున్నారు. దర్శనం చేసుకోకుండా తిరిగి వెళ్లిపోతున్న వారిలో ఏపీ, తమిళనాడుకు చెందిన భక్తులు కూడా ఉన్నారు. పంబ, అపాచీకి మేడ నుంచి శబరిపీఠం వరకూ క్యూ ఉంది.
Also Read: Bigg Boss 7 Telugu: అమర్ కు పెరిగిన ఓట్లు.. టాప్ 3 లో ఆ ముగ్గురు?
శబరిమలకు వెళ్లే రహదారుల్లో మంగళవారం కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. గత ఐదు రోజులుగా రోడ్లపై వాహనాలు బారులు తీరుతున్నాయి. తాము శబరిమల చేరుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని భక్తులు నిరసనలు తెలుపుతున్నారు. పంబ చేరుకుని తిరిగి వెళ్లాలంటే.. చాలా కష్టంగా ఉందంటున్నారు. రోజుకు లక్షకు పైగా భక్తులు శబరిమలకు రావడం వల్ల తీవ్ర రద్దీ ఏర్పడిందని కేరళ దేవాదాయశాఖ మంత్రి కె రాధాకృష్ణన్ తెలిపారు. శబరిమలలో సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామని చెప్పారు.