Harish Rao : రైతు భరోసా అమలుపై హరీష్ రావు ఆగ్రహం.. రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు
- రైతులకు మోసమే మిగిలిందా?
- రైతు బంధుతో పోల్చుతూ రేవంత్‌పై ధ్వజమెత్తిన హరీష్
- ఇందిరమ్మ భరోసా పథకం కేవలం మాటలకే పరిమితమైంది: హరీష్ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao : రైతు భరోసా అమలు విషయంలో మరోసారి తన మాటను నిలబెట్టుకోలేదని సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, మాట తప్పడం, రైతులను మోసం చేయడం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందని ఆయన ధ్వజమెత్తారు.
జనవరి 26న రైతు భరోసా కింద ఇచ్చే డబ్బులను మార్చి 31లోగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారని, ఆ హామీ ఇంకా నెరవేరలేదని హరీష్ రావు ఎద్దేవా చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనూ మార్చి 31 కల్లా రైతులందరికీ రైతు భరోసా అందజేస్తామని హామీ ఇచ్చారని, కానీ ఏప్రిల్ 1వ తేదీ వచ్చేసినా ఆ నిధుల గురించి ఎలాంటి ప్రకటన రాలేదని ఆయన మండిపడ్డారు.
Also Read
- Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
- JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
ఉగాది పండుగను పురస్కరించుకుని రైతులు రైతు భరోసా నిధుల కోసం ఎదురుచూశారని, అయితే వారికి ప్రభుత్వం చేదు అనుభవం మిగిల్చిందని హరీష్ రావు విమర్శించారు. దసరాకు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని, సంక్రాంతికి అందిస్తామన్నా నిధులు రాలేదని, ఉగాది నాటికి కూడా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాకపోవడం బాధాకరమన్నారు. కాలండర్లు మారుతున్నా రేవంత్ రెడ్డి మాట మాత్రం మారడం లేదని ఎద్దేవా చేశారు.
నాట్ల సీజన్లో కేసీఆర్ రైతులకు రైతు బంధు అందించారని, కానీ రేవంత్ రెడ్డి కోతల సమయం వచ్చినా రైతు భరోసా అందించలేకపోయారని హరీష్ రావు ఆరోపించారు. మోసపూరిత పాలననే విధానంగా మార్చుకున్న రేవంత్ రెడ్డి రైతులను అన్ని కోణాల్లో దగా చేస్తున్నారని ఆరోపించారు.
‘‘రుణమాఫీ వాగ్దానం ఇంకా నెరవేరలేదు. ఇందిరమ్మ భరోసా పథకం కేవలం మాటలకే పరిమితమైంది. హామీలు నెరవేర్చకుండా మోసం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయింది. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగానే, అసెంబ్లీలో ప్రకటించినట్లుగానే రైతు భరోసా నిధులు అందించే వరకు బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తూనే ఉంటుంది. ప్రజల్లో మీ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటుంది’’ అని హరీష్ రావు హెచ్చరించారు.
Waqf Bill: “వక్ఫ్ బిల్లు” పాస్ అవుతుందా.. బీజేపీ, ఇండీ కూటమి బలాబలాలు ఎంత..?
తాజావార్తలు
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
-
Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు