జనాభా పెరుగుదలను అరికట్టడానికి ప్రభుత్వాలు కృషి చేస్తాయి. కానీ, అక్కడ మాత్రం తమ దేశ జనాభాను పెంచుకునేందుకు ఏకంగా నగదు ప్రోత్సాహకాలను అందిస్తోంది. ఇందులో మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. స్కూల్, కాలేజీ స్టూడెంట్స్ గర్భం దాల్చితే ఏకంగా రూ. లక్ష ప్రోత్సాహకాలను అందిస్తోంది. ఇంతకీ ఎక్కడ? ఎందుకు? అని ఆలోచిస్తున్నారా? రష్యాలో తీవ్రమైన జనాభా సంక్షోభం కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. గత దశాబ్దంలో జనన రేటులో గణనీయమైన తగ్గుదల, ఉక్రెయిన్ యుద్ధంలో వేలాది మంది యువత మరణం, పెరుగుతున్న వలసల రేటు రష్యా జనాభాను సంక్షోభంలోకి నెట్టాయి.
Also Read:Kangana : సేవ కాదు, లగ్జరీయే నా కోరిక.. రాజకీయ జీవితం పై కంగనా ఓపెన్ కామెంట్స్
రష్యాలో తగ్గుతున్న జనాభా రేటును ఆపడానికి, ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా అనేక విధానాలను రూపొందించింది. వారి లక్ష్యం ప్రజలు, ముఖ్యంగా మహిళలు, త్వరగా వివాహం చేసుకుని పిల్లలను కనమని ప్రోత్సహించడం. ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికి రష్యన్ ప్రభుత్వం అసాధారణమైన విధానానికి తెరలేపింది. మహిళలను, పాఠశాల, కళాశాల విద్యార్థులను ప్రోత్సహించడం ద్వారా జనాభా పెరుగుదల విధానాన్ని అమలు చేయడానికి రెడీ అయ్యింది.
రష్యాలో వేగంగా తగ్గుతున్న జనాభా, తగ్గుతున్న జనన రేటును సమతుల్యం చేయడానికి, మహిళలు, పెద్ద కుటుంబాల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారు. వీటిలో అందరి దృష్టిని ఆకర్షించిన పథకం కళాశాల, ఉన్నత పాఠశాల బాలికలకు గర్భధారణ సమయంలో నగదు ప్రోత్సాహకాలు ఇచ్చే పథకం. ఇది కొన్ని ప్రదేశాలలో అమలు చేస్తున్నారు. ది మాస్కో టైమ్స్, ఫార్చ్యూన్ నివేదిక ప్రకారం, రష్యాలోని సైబీరియాలోని కెమెరోవో, కరేలియా, బ్రయాన్స్క్, ఓరియోల్, టామ్స్క్ వంటి ప్రాంతాలలో ఇటువంటి పథకాలు ప్రారంభించారు. ఇక్కడ పాఠశాల లేదా కళాశాలలో చదువుతున్న బాలికలు, వారు కనీసం 22 వారాల గర్భవతిగా ఉండి, ప్రభుత్వ ప్రసూతి క్లినిక్‌లో నమోదు చేసుకున్నట్లయితే, వారికి 100,000 రూబిళ్లు (సుమారు ₹ 1 లక్ష) వరకు ఒకేసారి నగదు బోనస్ అందిస్తున్నారు.
Also Read:Raju Gaani Saval : జగపతిబాబు చేతుల మీదుగా ‘రాజు గాని సవాల్’ మూవీ టీజర్ లాంఛ్..
ఫార్చ్యూన్ నివేదిక ప్రకారం, 2024 మొదటి అర్ధభాగంలో, రష్యాలో కేవలం 599,600 మంది పిల్లలు మాత్రమే జన్మించారు – ఇది 25 సంవత్సరాలలో అత్యల్పం. ఇది దేశ భవిష్యత్తుకు వినాశకరమైనదని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ అన్నారు. రష్యా జనాభా ప్రస్తుతం 146 మిలియన్లు. 1990 ప్రారంభంలో 148 మిలియన్లు ఉండగా, 2100 నాటికి ఇది 74 మిలియన్ల నుంచి 112 మిలియన్ల మధ్య తగ్గుతుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది.