Raju Gaani Saval : జగపతిబాబు చేతుల మీదుగా ‘రాజు గాని సవాల్’ మూవీ టీజర్ లాంఛ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లెలిజాల రవీందర్, రితికా చక్రవర్తి హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న చిత్రం ‘రాజు గాని సవాల్’. లెలిజాల కమల ప్రజాపతి సమర్పణలో, ఎల్ ఆర్ ప్రొడక్షన్ బ్యానర్ పై లెలిజాల రవీందర్ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా రక్షా బంధన్ పండుగ సందర్భంగా ఆగస్టు 8న శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. దీంతో తాజాగా ఈ మూవీ టీజర్ ను వర్సటైల్ యాక్టర్ జగపతి బాబు రిలీజ్ చేశారు. అనంతరం ఫిల్మ్ ఛాంబర్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ప్రముఖ నిర్మాత దామోదర్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో
Also Read : Samantha : సమంత.. రాజ్ ప్రేమ ఒప్పుకున్నట్టేనా?
Also Read
- Next Year Movies : 2027లో టాలీవుడ్లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..
- Maremma Review: మారెమ్మ సినిమా రివ్యూ..
- Udaya Bhanu: 15 ఏళ్లుగా తపస్సు చేస్తున్నా.. ప్రశాంతంగా 2 గంటలు కూడా నిద్రపోలేదు.. ఉదయ భాను ఎమోషనల్ కామెంట్స్!
- Vrushakarma Release Update: 'వృషకర్మ' కీలక అప్డేట్.. ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్న నాగ చైతన్య?
ప్రముఖ నిర్మాత దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘ఇది నాకు ఫ్యామిలీ ఈవెంట్ లాంటిది. బాపిరాజు గారు నాకు చాలా దగ్గరి వ్యక్తి. ఆయన ఏదైనా సినిమా తీసుకునే ముందు చాలా ఆలోచిస్తారు. “రాజు గాని సవాల్” సినిమాను ఆయన తీసుకున్నారంటే అది తప్పకుండా బాగుంటుంది. బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ సినిమాలను మన ప్రేక్షకులు అద్భుతంగా ఆదరిస్తారు. ఈ సినిమా కూడా అలాంటి మంచి సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నా. అన్నారు. హీరో లెలిజాల రవీందర్ మాట్లాడుతూ..
‘ ‘రాజు గాని సవాల్’ టీజర్ ను రిలీజ్ చేసిన జగపతి బాబు గారికి థాంక్స్. మా మూవీ హైదరాబాద్ కల్చర్ ను చూపిస్తూ, తెలంగాణలో ఫ్యామిలీ బాండింగ్ ను రిఫ్లెక్ట్ చేసేలా ఉంటుంది. ఇక్కడ బ్రదర్ సిస్టర్ మధ్యలో బాండింగ్ ఎలా ఉంటుంది, అలాగే కుటుంబంలో బంధాలు ఎలా ఉంటాయి, స్నేహితుల మధ్య ఉన్న రిలేషన్ ఎలా ఉంటుందని చూపించాం. హైదరాబాద్ లో జరిగే కల్చరల్ ఈవెంట్ లో ఎలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయి అనేది సహజంగా తెరకెక్కించేందుకు లోయర్ ట్యాంక్ బండ్ లోని కవాడిగూడ లో రియల్ లొకేషన్స్ లో షూటింగ్ చేశాం. తెలంగాణ సంస్కృతి నేపథ్యంగా సాగే క్లాసిక్ మూవీ ఇది. ఎంటర్ టైన్ మెంట్ తో పాటు మంచి ఎమోషనల్ డ్రామా ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో ఎంతో అనుభవం ఉన్న బాపిరాజు గారు మా సినిమాను చూసి రిలీజ్ చేసేందుకు ముందుకు వచ్చినందుకు ఆయనకు రుణపడి ఉంటాం. మా మూవీ కంటెంట్ మీద పూర్తి నమ్మకం ఉంది. ఈ సినిమా విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాం’ అన్నారు.
హీరోయిన్ రితికా చక్రవర్తి మాట్లాడుతూ.. ‘మా సినిమాను సపోర్ట్ చేస్తూ మా మూవీ టీజర్ రిలీజ్ చేసిన జగపతిబాబు గారికి థ్యాంక్స్. ఈ చిత్రంలో నటించే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది. “రాజు గాని సవాల్” సినిమా నేటివ్ ఎలిమెంట్స్ తో పక్కా లోకల్ గా ఉండి ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకు వర్క్ చేసిన ప్రతి ఒక్కరికీ నా బెస్ట్ విశెస్ అందిస్తున్నా. “రాజు గాని సవాల్” సినిమా సక్సెస్ అవుతుందని మేమంతా ఆశిస్తున్నాను’ అన్నారు.
తాజావార్తలు
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
-
BRICS Summit 2026: పుతిన్-మోడీ-జిన్‌పింగ్.. ప్రపంచం చూపంతా ఢిల్లీ వైపే!
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?