ప్రజంట్ ఇండస్ట్రీలో బాగా వినపడతున్న పేరులో రుక్మిణీ వసంత్ ఇకరు. కన్నడ చిత్రం ‘సప్త సాగరదాచె ఎల్లో’తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తన అందం నటనతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక రీసెంట్‌గా ‘కాంతార: చాప్టర్ 1’లో కనకవతిగా సెన్సేషన్ సృష్టించిన రుక్మిణీ వసంత్ టాలీవుడ్‌లో వరుస అవకాశాలు దక్కించుకుంటోంది. ఇప్పటికే ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమాతో ఎంట్రీ ఇస్తున్న ఈ భామ, ఇప్పుడు యంగ్ హీరో శర్వానంద్ సరసన మరో క్రేజీ ఆఫర్ కొట్టేసింది. సీనియర్ దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమాలో రుక్మిణి హీరోయిన్‌గా ఎంపికైనట్లు తెలుస్తోంది. తన అందం, అభినయంతో ఇప్పటికే కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన ఈ బ్యూటీ, శర్వానంద్‌తో కలిసి ఎలాంటి మ్యాజిక్ చేస్తుందోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక,
ఈ సినిమా కథ విషయానికి వస్తే, తెలియని వయసులో ఆవేశంగా చేసిన ఒక పని వల్ల హీరో జీవితంలో ఎలాంటి డ్రామా చోటుచేసుకుందనే ఆసక్తికర పాయింట్‌తో శ్రీను వైట్ల ఈ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. ‘విశ్వం’ తర్వాత ఎలాగైనా ఒక హిట్ అందుకోవాలనే పట్టుదలతో ఉన్న ఆయన, ఈ సినిమాలో ఒక సీనియర్ హీరోను కూడా ఒక కీలక పాత్ర కోసం తీసుకుంటున్నట్టు సమాచారం. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి నుంచి ప్రారంభం కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వస్తుండటం, శ్రీను వైట్ల మార్క్ కామెడీతో కూడిన డ్రామా ఉండటంతో ఈ ప్రాజెక్ట్‌పై మంచి అంచనాలు నెలకొన్నాయి.