తెలుగు చిత్ర పరిశ్రమలో టాలెంట్ ఉన్న హీరోయిన్స్ చాలా మంది వున్నారు. కానీ వారికీ సరైన అవకాశాలు రావడం లేదు.ఛాన్స్ ఇచ్చి చూస్తే అద్భుతంగా నటించి మెప్పించే హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. అలా టాలెంట్ వున్న హీరోయిన్స్ లో నవీనా రెడ్డి కూడా ఒకరు.ఈ భామ ఎలాంటి పాత్ర వచ్చిన అద్భుతం గా నటిస్తూ మెప్పిస్తుంది.నవీనా రెడ్డి రీసెంట్ గా విడుదల అయిన రుద్రంగి సినిమా లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించింది.రుద్రంగి సినిమాలో జగపతి బాబు ప్రధాన పాత్ర లో నటించారు. మమతా మోహన్ దాస్, విమలా రామన్ వంటి వారు ఈ సినిమా లో ముఖ్య పాత్రలలో నటించారు. పూర్తి తెలంగాణ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా రీసెంట్ గా విడుదల అయి మంచి విజయం సాధించింది.ఈ సినిమాలో నవీనా రెడ్డి యాక్టింగ్ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది.
ఈ సినిమాలో తన నటనతో ఆమె ప్రేక్షకులను ఫిదా చేసిందని చెప్పవచ్చు.విశ్వక్ సేన్ హీరో గా తెరకెక్కిన హిట్ సినిమాలో స్వప్న అనే పాత్ర లో నటించి మంచి గుర్తింపు సంపాదించిన నవీనా రెడ్డి రుద్రంగి సినిమాలో కూడ అద్భుతంగా నటించింది.రుద్రంగి సక్సెస్ కావడం తో నవీనా రెడ్డికి వరుస ఆఫర్లు వస్తున్నాయి.టాలీవుడ్ దర్శకనిర్మాతలకు నవీనా రెడ్డి రూపంలో ఒక మంచి నటి దొరికింది.. నవీనా రెడ్డి నటించిన సినిమాలలో చాలా సినిమాలు సక్సెస్ సాధిస్తున్నాయి. ఉప్పెన, అల్లూరి, త్రిశంకు, అర్ధ శతాబ్దం, ఎఫ్ వంటి సినిమాలలో నటించి మెప్పించింది ఈ భామ.సోషల్ మీడియాలో కూడా ఈ భామకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.తాజాగా ప్రవాహం (ఒక చోట ఆగదు)అనే సినిమాలో నవీనా రెడ్డి హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా స్క్రిప్ట్ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా ఉందని సమాచారం..ఈ సినిమాతో ఈ భామకు మరిన్ని అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.