రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ జనాభా పెరుగుదల రేటు (ఫెర్టిలిటీ రేటు) క్షీణతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఓ కార్యక్రమంలోఆయన మాట్లాడుతూ.. జనాభా పెరుగుదల రేటు తగ్గడం ఆందోళన కలిగిస్తోందన్నారు. జనాభా పెరుగుదల రేటు 2.1 కంటే తక్కువ ఉండకూడదని డెమోగ్రఫీ నిబంధనలు చెబుతున్నాయన్నారు.
మాజీ ప్రధాని, దివంగత ఇందిరా గాంధీ 1975, జూన్ 25న ‘ఎమర్జెన్సీ’ విధించారు. అయితే.. ఈ జూన్ 25వ తేదీని ప్రతీ ఏడాది ‘‘సంవిధాన్ హత్యా దివాస్’’గా జరుపుకోవాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.