రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ జనాభా పెరుగుదల రేటు (ఫెర్టిలిటీ రేటు) క్షీణతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఓ కార్యక్రమంలోఆయన మాట్లాడుతూ.. జనాభా పెరుగుదల రేటు తగ్గడం ఆందోళన కలిగిస్తోందన్నారు. జనాభా పెరుగుదల రేటు 2.1 కంటే తక్కువ ఉండకూడదని డెమోగ్రఫీ నిబంధనలు చెబుతున్నాయన్నారు.
India fertility rate: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో సంతానోత్పత్తి రేటు(ఫర్టిలిటీ రేట్) పడిపోతోంది. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు తక్కువ సంతానోత్పత్తి రేటును ఎదుర్కొంటున్నాయి. ఇదిలా ఉంటే ఇండియాలో కూడా సంతానోత్పత్తి రేటు 1950లో దాదాపుగా 6.2 శాతంగా ఉంటే 2021 నాటికి 2కి పడిపోయినట్లు ది లాన్సెట్ అధ్యయనం తెలిపింది.
Fertility Rate:ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకుంది. 19 శతాబ్ధంలో 100 కోట్ల మైలురాయిని చేరుకున్న ప్రపంచ జనాభా, గత 50 ఏళ్లలోనే రెట్టింపు అయింది. 1975 తర్వాతే సగం జనాభా పెరిగారు. దాదాపుగా 140 కోట్ల జనాభాతో భారత్ ‘థ్రెష్ హోల్డ్ లిమిట్’కు చేరుకుంది. ఇదిలా ఉంటే సంతానోత్పత్తి రేటులో మాత్రం ఆఫ్రికా దేశాలు దూసుకుపోతున్నాయి. చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాల్లో సంతానోత్పత్తి రేటు క్షీణించగా.. ఆఫ్రికా దేశాల్లో మాత్రం ఇది ఎక్కువగా…
Bumper Offer : సిక్కిం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. నానాటికి తగ్గిపోతున్న తమ జాతి జనాభాను పెంచుకునేందుకు సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ కొత్త రకం పాలసీ తీసుకురానున్నారు.
Fertility Rate: పిల్లలను కనాలని పెళ్లి చేసుకున్న దంపతులు తాపత్రయపడుతుంటారు. అయితే కొందరు కొన్ని సమస్యల కారణంగా పిల్లలను కనడం వాయిదా వేసినా ఎప్పటికైనా పిల్లలను అయితే తప్పకుండా కనాల్సిందే. కానీ ప్రస్తుత జీవన విధానం ఈతరం మహిళల సంతానోత్పత్తి తీవ్ర ప్రభావం చూపిస్తోంది. గడిచిన పదేళ్ల కాలంలో దేశంలో సాధారణ సంతానోత్పత్తి రేటు 20 శాతం పడిపోయిందని శాంపిల్ రిజిస్ట్రేషన్ డేటా 2020 రిపోర్టు వెల్లడించింది. దేశంలోని ప్రతి వెయ్యి మంది మహిళలకు ఒక ఏడాదిలో…
గతంలో ప్రతి దంపతులు ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలను కనేవాళ్లు. కానీ కొన్నేళ్ల నుంచి దంపతుల ఆలోచన విధానం మార్పులు వచ్చాయి. కేవలం ఇద్దరు లేదా ముగ్గురు చాలు అనుకుంటున్నారు. కొందరు అయితే ఒకరితోనే సరిపెట్టేస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా కుటుంబాల్లో పిల్లల సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది. అయితే ఏపీలో కుటుంబ నియంత్రణ పాటిస్తున్న వారి సంఖ్య మరీ ఎక్కువైనట్లు కనిపిస్తోంది. ఈ విషయం జాతీయ ఆరోగ్య సర్వేలో వెల్లడైంది. ఏపీలో సగటున ప్రతి 10 కుటుంబాలకు 17…