కర్నాటకలోని అత్తిబెలెలోని ఓ బాణసంచా దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 14 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన శనివారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో జరిగింది. అయితే ఈ ఘటనను ప్రభుత్వం దీనిని “తీవ్రమైన సంఘటన” అని పేర్కొంది. ఆదివారం ప్రమాద స్థలాన్ని డిప్యూటీ సీఎం డికె శివకుమార్ సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రతి బాధిత కుటుంబీకులకు ప్రభుత్వం రూ. 5 లక్షల చొప్పున నష్టపరిహారం ఇస్తామన్నారు. ఇది గ్రేవ్ ఇన్సిడెంట్… తాము కార్యాచరణ ప్రణాళికతో ముందుకు రాబోతున్నట్లు తెలిపారు. రెండు మూడు రోజుల్లోనే చర్యలు తీసుకుంటామని… ఇప్పటికే చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షలు, ఆస్పత్రి ఖర్చులు చూసుకుంటామన్నారు.
Read Also: Virat Kohli: సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ!
ఇదిలా ఉంటే.. కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదివారం నాడు పోలీసు కస్టడీలో ఉన్న షాపు యజమాని నిర్లక్ష్యం కారణంగా అగ్ని ప్రమాదంపై దర్యాప్తు చేయాలని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సిఐడి)ని ఆదేశించారు. మరోవైపు మృతుల్లో ఇంకా కొన్ని మృతదేహాలను గుర్తించాల్సి ఉందన్నారు. ఈ ఘటనలో పద్నాలుగు మంది మరణించారని, అందరూ తమిళనాడుకు చెందిన వారేనని తెలిపారు. వారిలో ఎక్కువ మంది విద్యార్థులేనని, చదువు కోసం డబ్బు సంపాదించేందుకు ఇక్కడ పనిచేస్తున్నారని సీఎం సిద్ధరామయ్య అన్నారు. అధికారులు జరిపిన నష్టం అంచనా ప్రకారం ఏడు ద్విచక్ర వాహనాలు, ఒక కంటైనర్ లారీ, మరో మూడు వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి.
Read Also: Basavaraj Bommai: కర్నాటకలో గణపతి మహోత్సవాన్ని ఆపే ప్రయత్నం జరుగుతోంది