గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టంచిన సినిమా ఆర్ఆర్ఆర్. దర్శక దిగ్గజం రాజమౌళి ఈ సినిమాను కొమురం భీమ్ – అల్లూరి సీతారామరాజు వంటి స్వతంత్ర సమరయోధుల కల్పిత కథతో ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాను రూపొందించాడు. ఈ సినిమాలో రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో,ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో అద్భుతంగా నటించారు.. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ సీత పాత్రలో నటించి మెప్పించింది.అలాగే విదేశీ నటి ఓలివియా మోరిస్ జెన్నీ పాత్రలో అద్భుతంగా నటించింది.భారీ అంచనాలతో గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా తిరుగులేని విజయం విజయాన్ని అందుకుంది. దాదాపు రూ.1000 కోట్ల వసూళ్లు పైగా రాబట్టింది.. మరోవైపు ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే ఆర్‌ఆర్‌ఆర్’పై బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా ప్రశంసల వర్షం కురిపించారు. తనకెంతో నచ్చిన భారతీయ చిత్రం ఇదేనని ఆయన అన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా ఎంతో అద్భుతంగా ఉందన్న ఆయన చిత్రయూనిట్ ను మెచ్చుకున్నారు.”ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా నాకు బాగా నచ్చంది. 3 గంటలు నిడివి ఉన్న ఫీచర్ ఫిల్మ్ ఇది. అద్భుతమైన సన్నివేశాలు అలాగే అందమైన డ్యాన్సులు ఈ సినిమాలో ఉన్నాయి. భారత్‌పై బ్రిటిష్ కంట్రోల్‌ను తెలియజేస్తూ లోతైన విమర్శ చేసినప్పటికీ కూడా దానిని కూడా ఎంతో అర్థవంతంగా చూపించారు. ఆ సినిమా చూసిన తర్వాత నాకు తెలిసిన వాళ్లందరినీ కూడా ‘మీరు ‘ఆర్‌ఆర్‌ఆర్’ వీక్షించారా..అని నేను మొదటగా అడిగాను . ఈ చిత్రాన్ని అన్ని విధాలుగా చూసి నేను ఎంజాయ్ చేశాను. ఆర్ఆర్ఆర్ చిత్రదర్శకుడు మరియు నటీనటులకు నా అభినందనలు” అని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.కాగా, దీనికి సంబంధించిన ఓ వీడియోను ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్ తాజాగా ట్విటర్‌లో షేర్ చేసింది. ”మా చిత్రంపై మీ విలువైన అభిప్రాయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్యూ సర్. మీ ప్రశంసలతో మా టీమ్ మొత్తం ఎంతో సంతోషంగా ఉందని తెలియజేసింది.
https://twitter.com/RRRMovie/status/1700758302064619821?s=20