Impact Player Of The Series: భారత్, ఆస్ట్రేలియా సిరీస్ అందిరికి మాములు సిరీస్ మాత్రమే. కాకపోతే టీమ్‌ఇండియా బ్యాట్స్‌మెన్స్ రోహిత్ శర్మ, కోహ్లీలకు ఒక కీలకమైన అస్సైన్‌మెంట్. అందులో ముఖ్యంగా ఏడు నెలల సుదీర్ఘ విరామం తర్వాత జాతీయ జట్టులోకి పునరాగమనం చేసిన రోహిత్‌పై.. కెప్టెన్సీని కోల్పోవడం, ఫామ్ కోల్పోయాడనే సందేహాలు విమర్శకులలో నెలకొన్నాయి. అయితే వాటి అన్నింటికీ తన బ్యాట్‌తోనే సమాధానం చెప్పిన రోహిత్, ఈ సిరీస్‌ను మూడు మ్యాచుల్లో 202 పరుగుల అద్భుతమైన ప్రదర్శనతో ముగించి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును గెలుచుకున్నాడు.
IND vs SA: బావుమా రీ-ఎంట్రీ.. టీమిండియాతో తలపడే సౌతాఫ్రికా జట్టు ఇదే..!
ఇది ఇలా ఉండగా.. చివరి వన్డే ముగిసిన తర్వాత, రోహిత్ శర్మకు మరో ప్రత్యేక పురస్కారం లభించింది. అదే ‘ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు. భారత జట్టు మేనేజ్‌మెంట్ ఈ ప్రత్యేక అవార్డును అందించింది. ఈ ‘ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును టీమ్ ఇండియా స్ట్రెంత్ అండ్ కండీషనింగ్ కోచ్ అడ్రియన్ లే రూక్స్ అందింస్తూ.. ఈ అవార్డు ఒక ప్రత్యేక వ్యక్తికి ఇవ్వడం గొప్ప గౌరవం. ఒక నాయకుడిగా, అనుభవజ్ఞుడైన ఆటగాడిగా రోహిత్ అందుకు అర్హుడు అని మేమంతా ఏకీభవిస్తాం అని ప్రశంసించి అవార్డు అందించారు.
ఇక టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ సైతం రోహిత్ శర్మను, జట్టు ప్రదర్శనను ప్రత్యేకంగా కొనియాడారు. జట్టులో బ్యాటింగ్ విషయానికొస్తే, శుభ్‌మన్ (గిల్), రోహిత్ భాగస్వామ్యం చాలా కీలకమని తెలుపుతూ.. ఆ తర్వాత రోహిత్, విరాట్ కోహ్లీ భాగస్వామ్యం అద్భుతంగా, చాలా క్లినికల్‌గా ఉందని కొనియాడారు. ఇక రోహిత్ ను ఉద్దేశించి మరో సెంచరీ అత్యద్భుతంగా ఉందని అన్నారు. ముఖ్యంగా రోహిత్, విరాట్ ఇద్దరూ మ్యాచును ముగించడం చాలా ముఖ్యం అని గంభీర్ అన్నారు. ఆస్ట్రేలియాను 237 పరుగులకు కట్టడి చేసిన బౌలర్ల కృషిని కూడా గంభీర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆరంభంలో 10 ఓవర్లకు 63 పరుగులు ఇచ్చినప్పటికీ, అక్కడి నుంచి అద్భుతంగా పుంజుకోవడం గొప్ప ప్రయత్నమని, ముఖ్యంగా హర్షిత్ అద్భుతమైన స్పెల్ వేశాడని ప్రశంసించారు.
Riaz Encounter Case: రియాజ్ కుటుంబానికి పోలీసుల వేధింపులు.. మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు..!
పెర్త్‌లో నిరాశపరిచే సింగిల్ డిజిట్ స్కోరు నుంచి, అడిలైడ్‌లో తన సహజమైన ఆటను పక్కనపెట్టి 97 బంతుల్లో విలువైన 73 పరుగులు చేయడం, ఆపై సిడ్నీలో 125 బంతుల్లో 121* పరుగులతో మెరుపు సెంచరీ చేయడం వరకు.. ఈ 202 పరుగుల సిరీస్‌లో ‘హిట్‌మ్యాన్’ పోరాట పటిమను, మ్యాచ్ గెలిపించే సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపాడు. ఈ ప్రదర్శనతో 2027లో జరగబోయే ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ పై తన దృష్టి చెదరలేదని ఆ లక్ష్యం కోసం అన్ని ఫిట్‌నెస్, క్రికెటింగ్ మైలురాళ్లను సాధిస్తానని రోహిత్ శర్మ స్పష్టం చేసినట్లైంది.