Riaz Encounter Case: ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన షేక్ రియాజ్ కుటుంబ సభ్యులు సోమవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (SHRC)ను ఆశ్రయించారు. తన కొడుకు ఎన్‌కౌంటర్‌కు దారి తీసిన పరిస్థితులు, ఆ తరువాత పోలీసులు తమను వేధిస్తున్న తీరుపై రియాజ్ తల్లి, భార్య, పిల్లలు కమిషన్ చైర్మన్ జస్టిస్ షామీమ్ అక్తర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో రియాజ్ కుటుంబ సభ్యులు తమను స్వగ్రామంలోకి కూడా రానివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని, తీవ్రంగా వేధింపులకు గురిచేస్తూ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారని కమిషన్‌కు వివరించారు.
AB De Villiers: రోహిత్ – కోహ్లీలను విమర్శిస్తున్న వారికి ఏబీ డివిలియర్స్ స్ట్రాంగ్ కౌంటర్..
మరణించిన కానిస్టేబుల్ ప్రమోద్‌తో రియాజ్‌కు ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవలు ఉన్నాయని రియాజ్ కుటుంబ సభ్యులు కమిషన్‌కు వివరించారు. రియాజ్ భార్య తన ఫిర్యాదులో.. కానిస్టేబుల్ ప్రమోద్ ఒక కేసు విషయంలో రియాజ్‌ను రూ. 3 లక్షలు డిమాండ్ చేశారని.. రియాజ్ అప్పటికప్పుడు రూ. 30 వేలు చెల్లించాడని తెలుపుతూ.. మిగతా డబ్బులు ఇవ్వాలని ప్రమోద్ రియాజ్‌ను తీవ్రంగా వేధించారని ఆరోపించింది. ఇకపోతే ఈ ఎన్‌కౌంటర్ ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ గతంలోనే సుమోటోగా కేసు స్వీకరించింది. దీనికి సంబంధించిన సమగ్ర నివేదికను వచ్చే నెల (నవంబర్) 24వ తేదీలోపు సమర్పించాలని రాష్ట్ర డీజీపీకి కమిషన్ చైర్మన్ జస్టిస్ షామీమ్ అక్తర్ ఆదేశించారు.
Viral Video: ఛీ.. ఛీ.. అయ్యప్ప మాల వేసుకొని ఈ గలీజు పనేంటి స్వామి..!
తాజాగా, రియాజ్ కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న కమిషన్ చైర్మన్.. నివేదిక సమర్పణ గడువును మరింత తగ్గిస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు. వచ్చే నెల 3వ తేదీలోపు నివేదికను సమర్పించాలని డీజీపీని ఆదేశించారు. ఈ ఎన్‌కౌంటర్ వ్యవహారం, కుటుంబ సభ్యుల ఫిర్యాదు దృష్ట్యా రాష్ట్ర పోలీసులకు మరింత త్వరగా నివేదిక ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.