భారత సారథి, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఐసీసీ వన్డే టోర్నీల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా మంగళవారం దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి సెమీ ఫైనల్లో రోహిత్ ఈ ఫీట్ సాధించాడు. ఆసీస్ పేసర్ నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో మిడ్ వికెట్ మీదుగా హిట్‌మ్యాన్ సిక్సర్ బాదాడు. ఐసీసీ వన్డే టోర్నీల్లో రోహిత్‌కు ఇది 65వ సిక్స్. ఈ క్రమంలో యూనివర్సల్ బాస్, వెస్టిండీస్…
దుబాయ్ తమ సొంతగడ్డ కాదు అని, ఇక్కడ భారత్ ఎక్కువ మ్యాచ్‌లేమీ ఆడలేదని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. దుబాయ్ పిచ్ ప్రతిసారీ భిన్న సవాళ్లను విసురుతోందని, తాము ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒక్కోసారి ఒక్కో రకంగా స్పందించిందన్నాడు. దుబాయ్ మైదానంలో నాలుగు పిచ్‌లు ఉన్నాయని, సెమీ ఫైనల్ దేనిపై ఆడిస్తారో తెలియదని హిట్‌మ్యాన్ చెప్పాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ ఒకే మైదానంలో ఆడుతోందని, భారీ లాభం పొందుతోందని కొందరు మాజీలు, క్రికెటర్లు అంటున్న…
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో నాకౌట్ మ్యాచ్‌లకు సమయం ఆసన్నమైంది. మొదటి సెమీస్‌లో టాప్ టీమ్స్ భారత్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్ చేరుతుంది. లీగ్ దశలో మూడుకు మూడు మ్యాచ్‌లలో ఘన విజయాలు సాధించిన రోహిత్ సేనకు సెమీస్ అంత ఈజీ కాదు. ఎందుకంటే ఐసీసీ టోర్నీల్లో నాకౌట్‌లో కంగారూలు రెచ్చిపోతారు. అయితే దుబాయ్‌లో ఇప్పటికే మూడు మ్యాచ్‌లు ఆడిన అనుభవం, పిచ్‌కు తగ్గ బలమైన స్పిన్ ఉండడం టీమిండియాకు కలిసొచ్చే అంశం.…
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య సెమీస్ మ్యాచ్ ఆరంభమైంది. మూడు లీగ్ మ్యాచుల్లో ఘన విజయాలు సాధించిన రోహిత్ సేన.. ఆస్ట్రేలియాపై అదే జోరు కొనసాగించాలని చూస్తోంది. టీమిండియా ఈ మ్యాచులో గెలిచి ఫైనల్ చేరాలని భావిస్తోంది. అంతేకాదు 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఓటమికి బదులు తీర్చుకోవాలని రోహిత్ సేన చూస్తోంది. అయితే స్టార్ ఆటగాళ్ల గైర్హాజరీలో ఆసీస్ కొంత బలహీన పడ్డట్లు కనిపిస్తున్నా.. ఆ జట్టును తక్కువ అంచనా…
ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆరంభం కానుంది. ఈ టోర్నీ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సర్వం సిద్ధం చేస్తోంది. ట్రోఫీ ఏర్పాట్లలో బిజీగా ఉన్న పీసీబీకి మరో తలనొప్పి వచ్చింది. పాకిస్థాన్‌కు వన్డే ప్రపంచకప్ అందించిన మాజీ కెప్టెన్, మాజీ పీఎం ఇమ్రాన్ ఖాన్ పేరును గడాఫీ స్టేడియం నుంచి తొలగిస్తారనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. ఈ వార్తలపై పీసీబీ వర్గాలు స్పందించాయి. ఎవరి పేర్లను తొలగించడం గాని, మార్చడం…
ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19న ప్రారంభం కానుంది. ఈ ట్రోఫీ ఆరంభోత్సవాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ), అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కలిసి ఫిబ్రవరి 16న లాహోర్‌లో నిర్వహించనున్నాయి. ఈ కార్యక్రమంకు చారిత్రక లాహోర్ కోటలోని హుజూరి బాగ్ వేదిక కానుంది. అయితే ఐసీసీ టోర్నీ ఆరంభానికి ముందు సంప్రదాయంగా వస్తున్న అన్ని జట్ల కెప్టెన్ల ఫొటోషూట్, మీడియా సమావేశాన్ని ఈసారి నిర్వహించడం లేదని తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ప్రధాన జట్లు…