ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త సంవత్సరంలో ఏపీ ప్రజలు అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ నూతన ఏడాది అన్నం పెట్టే అన్నదాతల జీవితంలో సుఖ సంతోషాలు తీసుకురావాలని కోరారు. ఈ మేరకు ప్రతిఒక్కరు ఎక్స్ వేదికగా పోస్టులు పెట్టారు.
‘రాష్ట్ర ప్రజలు నూతనోత్సాహంతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకాలని, ఆశలు ఆశయాలూ తీర్చే బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. రాష్ట్ర ప్రజలు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు రాష్ట్ర పునర్ నిర్మాణానికి అంకితం కావాలని కోరుకుంటూ అందరికి నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు’ అని సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. ప్రజలందరికీ ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు అని జనసేన పార్టీ పేర్కొంది.
‘అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన ఏడాది ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ సంతోషాలు, ఆనందాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నా. గడచిన ఏడాదిలో రాష్ట్ర ప్రజలు విధ్వంస, నియంతృత్వ పాలనను తరిమికొట్టి ప్రజాస్వామ్య పాలనను పునరుద్ధరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నిలిపేందుకు కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోంది. సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. ఎన్నో ఆశలు, ఆనందాలు, సంతోషాలను మోసుకువస్తున్న కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ.. తెలుగువారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు’ అని మంత్రి నారా లోకేశ్ ట్వీటారు.
రాష్ట్ర ప్రజలు నూతనోత్సాహంతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకాలని, ఆశలు ఆశయాలూ తీర్చే బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. రాష్ట్ర ప్రజలు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు రాష్ట్ర పునర్ నిర్మాణానికి అంకితం కావాలని కోరుకుంటూ అందరికి నూతన ఆంగ్ల సంవత్సర… pic.twitter.com/fH8uDsVjjr
— N Chandrababu Naidu (@ncbn) January 1, 2025
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన ఏడాది ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ సంతోషాలు, ఆనందాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నా. గడచిన ఏడాదిలో రాష్ట్ర ప్రజలు విధ్వంస, నియంతృత్వ పాలనను తరిమికొట్టి ప్రజాస్వామ్య పాలనను పునరుద్ధరించారు. ఆంధ్రప్రదేశ్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో… pic.twitter.com/rRarrDJf9A
— Lokesh Nara (@naralokesh) January 1, 2025