Robberies: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం బిసి కాలనీలో దొంగలు మంగళవారం (డిసెంబర్ 31) అర్దరాత్రి బీభత్సం సృష్టించారు. జనసంచారం మధ్య జరిగిన ఈ దొంగతనం కలకలం రేపింది. వరుసగా మూడు ఇళ్ళలో చోరీకి పాల్పడిన దుండగులు 25 గ్రాముల బంగారం, 38 వేల రూపాయల నగదు, ఓ మొబైల్ ను అపహరించారు. ఈ సంఘటనతో కాలనీ వాసులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. దొంగతనం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరి కూడా లేకపోవడం దొంగలకు సులభంగా పని…