డిసెంబర్ 22న రానున్న సలార్ హైప్ మొదలయ్యింది, ఎక్కడ చూసినా సలార్ సౌండ్ వినిపిస్తూనే ఉంది. ఈ సౌండ్ కి కారణం ఒక్క ట్రైలర్ మాత్రమే. ఇటీవలే రిలీజైన సలార్ ట్రైలర్ దెబ్బకు 24 గంటల్లో 116 మిలియన్ల వ్యూస్ వచ్చి సరికొత్త డిజిటల్ రికార్డ్ క్రియేట్ అయ్యింది. ఇంతలా సెన్సేషన్ క్రియేట్ చేసిన సలార్ ట్రైలర్‌ను పృధ్వీరాజ్ సుకుమారన్ చుట్టే కట్ చేశాడు ప్రశాంత్ నీల్. మూడున్నర నిమిషాలకు పైగా ఉన్న ఈ ట్రైలర్‌లో ప్రభాస్ కనిపించింది చాలా తక్కువ. అలాగే… ఈ ట్రైలర్‌లో కథ చెప్పే ప్రయత్నం చేశాడు నీల్. ఈ కారణంగా ట్రైలర్ లో యాక్షన్ కట్ షాట్స్ తక్కువగా పడ్డాయి. అందుకే… ప్రభాస్ ఫ్యాన్స్‌కు అసలు సిసలైన మాస్ ఫీస్ట్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు ప్రశాంత్ నీల్.
ఫుల్ మీల్స్ పెట్టేలా రెండో ట్రైలర్ కట్ చేసాడు. అంతేకాదు ఈ హై ఓల్టేజ్ ట్రైలర్ ని ఈరోజే బయటకు వదలబోతున్నారు. డిసెంబర్ 17న, అంటే సినిమా రిలీజ్‌కు సరిగ్గా 5 రోజుల ముందు రెండో ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు. ఇందులో గూస్ బంప్స్ ఫైట్స్ సీన్స్‌ను ప్రశాంత్ నీల్ చూపించబోతున్నాడట. ఈ ఒక్క ట్రైలర్ సలార్ ప్రీరిలీజ్ ఈవెంట్ రేంజులో హైప్ పెంచుతుందని సమాచారం. ఇప్పటికే ఉన్న అంచనాలకు పీక్స్‌కు తీసుకెళ్లేలా ఈ ట్రైలర్ 2 ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్ సెకండ్ ట్రైలర్ సాలిడ్ గా బయటకి వస్తే సలార్ సీజ్ ఫైర్ బాక్సాఫీస్ ని సీజ్ చెయ్యడానికి రెడీ అయినట్లే. మరి డిసెంబర్ 22న సలార్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Read Also: Upasana : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. మరో బేబీ రాబోతుందంటూ ఉపాసన పోస్ట్