ధూమపానం ఆరోగ్యానికి హానికరమని ఎంత చెప్పినా కొందరు మాత్రం అంత త్వరగా మానరు. అయితే.. ప్రస్తుతం యువత టీతో పాటు సిగరెట్ తాగేందుకు ఇష్టపడుతున్నారు. వారు దీన్ని చేయడం చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే టీ, సిగరెట్‌ల కలయిక వారి ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో వారికి తెలియదు. టీ, సిగరెట్ కలిపి తాగడం వల్ల చాలా తీవ్రమైన వ్యాధులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ రెండింటి కలయిక మీ ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో ఈ వార్తలో తెలుసుకుందాం...
Assembly Budget Session: నాలుగో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణలో హుక్కా సెంటర్లను నిషేధిస్తూ సవరణ బిల్లును సీఎం రేవంత్ రెడ్డి తరపున మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టగా సభ ఆమోదం తెలిపింది.
ఒత్తిడి కారణంగా ఈ మధ్య యువత ఎక్కువగా చెడు అలవాట్లకు బానిస అవుతున్నారు. కొన్ని సార్లు చెడు సావాసల కారణంగా కూడా మద్యం, సిగరెట్లకు అలవాటు పడుతున్నారు. దీని వల్ల యువత భవిష్యత్తుతో పాటు వారి ఆరోగ్యం కూడా పాడవుతుంది. అందుకే బ్రిటన్ ప్రభుత్వం త్వరలో కఠిన నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. నవతరాన్ని ధూమపానానికి దూరంగా ఉంచాలన్న ఉద్దేశంతో సిగరెట్లపై నిషేధం విధించాలని రిషి సునాక్ ప్రభుత్వం ఆలోచిస్తుందట. దీనిపై ప్రభుత్వం అధికారంగా వెల్లడించనప్పడికీ దీనిని కచ్ఛితంగా…
2035 నాటికి దేశవ్యాప్తంగా పొగాకు వినియోగాన్ని 5 శాతం కంటే తక్కువకు తగ్గించాలనే లక్ష్యంగా పెట్టుకుంది కెనడా. అందులో భాగంగానే ఈ నియంత్రణ అమలు చేయనున్నారు. పొగాకు ఉత్పత్తుల ప్యాకేజీలపై ఆరోగ్య సందేశాలను బలోపేతం చేయడంతో సహా దేశంలో ధూమపానం చేసేవారి సంఖ్యను తగ్గించవచ్చని ఆరోగ్య అధికారులు తెలిపారు.
పొగరాయుళ్లు ఎక్కడ పడితే అక్కడ.. అలా ఓ సిగరేట్ తీసుకుని.. స్టైల్‌గా దమ్ముకొడుతున్నారా? ఇక, మీకు షాక్ తప్పదు.. ఎందుకంటే, సిగరెట్లు లూజ్ సేలింగ్ బ్యాన్ చేసే విధంగా కేంద్రం సిద్ధం అవుతోంది.. కొన్ని నివేదికల ప్రకారం.. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని అరికట్టేలా సింగిల్ సిగరెట్ల అమ్మకాల్ని బ్యాన్ చేయాలని సలహా ఇచ్చినట్లు సమాచారం.. లూజ్ సిగరెట్ల అమ్మకాలు పొగాకు నియంత్రణపై చేస్తున్న ప్రచారాన్ని ప్రభావితం చేస్తున్నాయని కమిటీ సభ్యుల వాదనగా ఉంది..…
పొగ తాగితే ఆరోగ్యానికి హానికరం.. కళ్లు అరిగేలా, చెవులు చిల్లుపడేలా ప్రకటనలు వేస్తున్నా పొగరాయుళ్లు పట్టించుకోవడం లేదు. అంతెందుకు.. సిగరెట్ ప్యాక్ మీదే హెచ్చరిక సందేశాలున్నా బేఖాతరు చేస్తున్నారు. సిగరెట్ తీసుకొని, ప్యాకెట్‌ను పక్కన పడేసి, గుప్పుగుప్పుమంటూ పొగ వదిలేస్తున్నారు. సూటిగా, సుత్తి లేకుండా చెప్పాలంటే.. సిగరెట్ ప్యాక్‌లపై ఉండే సందేశాలకు ప్రాముఖ్యత లేకుండా పోయింది. అందుకే, కెనడా ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసి, నేరుగా సిగరెట్లపైనే హెచ్చరికల్ని ముద్రించాలని నిర్ణయించింది. ‘‘సిగరెట్ ప్యాక్‌లపై ఉంటే హెచ్చరిక…