భారత క్రికెటర్ రింకు సింగ్, ఎస్పీ ఎంపీ ప్రియా సరోజ్ ఇటీవల నిశ్చితార్థం చేసుకున్నారు. అనేక మంది భారత క్రికెటర్లతో పాటు, రాజకీయ నాయకులు, సన్నిహిత కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నిశ్చితార్థం తర్వాత, రింకు సింగ్ తొలిసారి తన అత్తమామల ఇంటికి వెళ్లాడు. భారత క్రికెటర్‌కు అతని అత్తమామల ఇంట్లో ఘన స్వాగతం లభించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read:Tooth Brush: డేంజర్.. టూత్ బ్రష్‌ను ఎక్కువ కాలం వాడితే ఏమౌతుందంటే…
రింకు సింగ్ తన అత్తమామల ఇంటికి చేరుకున్న వెంటనే, బొట్టుపెట్టి.. పూల వర్షం కురిపించి ఇంట్లోకి ఆహ్వానించారు. ఇంట్లోకి రాగానే పూలు జల్లుతూ పుష్పగుచ్చాలు చేతికి అందిస్తూ రింకూపై ఉన్న ప్రేమను వ్యక్తపరిచారు. ప్రియ సరోజ్ ను చూడగానే ఆనందంతో మురిసిపోయాడు. రింకు-ప్రియల ఉంగరోత్సవ వేడుక జూన్ 8న జరిగింది. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, జయా బచ్చన్, 20 మంది ఎంపీలు దీనికి హాజరయ్యారు. బిసిసిఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, క్రికెటర్లు పియూష్ చావ్లా, ప్రవీణ్ కుమార్, భువనేశ్వర్ కుమార్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఉంగరోత్సవ వేడుకలో ప్రియా భావోద్వేగానికి గురయ్యారు.
Also Read:Israel Iran War: ఇరాన్‌లో 80 మంది మృతి.. గగనతలం మూసేసిన ఇజ్రాయిల్..
అంతర్జాతీయ క్రికెట్‌లో రింకు ఆడిన 2 ODIలలో 2 ఇన్నింగ్స్‌లలో 27.50 సగటు, 134.14 స్ట్రైక్ రేట్‌తో 55 పరుగులు చేశాడు. ఇది కాకుండా, అతను 33 T20 అంతర్జాతీయా మ్యాచ్ లలో 24 ఇన్నింగ్స్‌లలో 546 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో అతని సగటు 42.00, స్ట్రైక్ రేట్ 161.06. రింకు T20 అంతర్జాతీయా మ్యాచ్ లలో 3 అర్ధ సెంచరీలు కూడా చేశాడు. అతని ఉత్తమ స్కోరు 69 నాటౌట్ పరుగులు.
Rinku Singh received a welcome on reaching her in-laws house for the first time. #rinkusingh #priyasaroj pic.twitter.com/zmc1yC7x0x
— Mahesh (@mahesh_716) June 15, 2025