Revolt RV BlazeX: పెరుగుతున్న వాయు కాలుష్యం, అలాగే ఇంధన ధరలకు సతమతవుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలు ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి. ఈ విభాగంలో ముఖ్యంగా ద్విచక్ర వాహన విభాగంలో ఎలక్ట్రిక్ వాహనాలు (EVలు) తమ ఆధిపత్యాన్ని చూపిస్తున్నాయి. ఈ పరిణామం మధ్య రివోల్ట్ ఇండియా సంస్థ తన పోర్ట్‌ఫోలియోలోకి కొత్త సరసమైన ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసింది. Revolt RV BlazeX పేరుతో విడుదలైన ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ.1.14 లక్షలుగా ఉంది. దీని డిజైన్, ఫీచర్లు, బ్యాటరీ, మోటార్ వంటి విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం.
Read Also: Best Mileage Cars: బెస్ట్ మైలేజ్ అందించే తోపు పెట్రోల్ కార్లు ఇవే.. ధర కూడా తక్కువే
Revolt RV BlazeX 4 KW ఎలక్ట్రిక్ మోటారుతో అమర్చబడి ఉంది. దీని 3.24 kWh IP67-రేటెడ్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 150 కిలోమీటర్ల ప్రయాణ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ బైక్ గంటకు 85 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకోగలదు. RV BlazeX డ్యూయల్ ఛార్జింగ్ సామర్థ్యంతో వస్తుంది. ఇది సాధారణ 3-పిన్ సాకెట్ ద్వారా వేగవంతమైన, ప్రామాణిక ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఫాస్ట్ ఛార్జర్‌తో 80 నిమిషాల్లో 80% వరకు ఛార్జ్ చేయవచ్చు. ప్రామాణిక హోమ్ ఛార్జర్‌తో 80% ఛార్జింగ్ కు దాదాపు 3 గంటల 30 నిమిషాలు తీసుకుంటుంది.
Revolt RV BlazeX మూడు రైడింగ్ మోడ్‌లతో వస్తుంది. ఇందులో రివర్స్ మోడ్ కూడా ఉండడం ఆశ్చర్యపరిచే విషయం. ఇది CBS బ్రేకింగ్, మెరుగైన దృశ్యమానత కోసం LED లైట్లు, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, ట్విన్ షాక్ అబ్జార్బర్‌లతో అమర్చబడి ఉంది. RV BlazeX 6-అంగుళాల LCD డిజిటల్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 4G టెలిమాటిక్స్, GPS ట్రాకింగ్, IoT ఆధారిత కార్యాచరణలతో ఇది స్మార్ట్ మొబైల్ కనెక్టివిటీ, రియల్-టైమ్ డయాగ్నస్టిక్స్, జియో-ఫెన్సింగ్, OTA అప్‌డేట్‌లకు సపోర్ట్ చేస్తుంది. ఇక ఈ బైక్ స్టెర్లింగ్ సిల్వర్ బ్లాక్, ఎక్లిప్స్ రెడ్ బ్లాక్ రెండు రంగులలో అందుబాటులో ఉంది.
Read Also: NTR NEEL: ‘ఎన్టీఆర్’ డ్రాగన్ ఇంటర్నేషనల్ లెవెల్ మూవీ
Revolt RV BlazeX బుకింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్ లేదా అధీకృత డీలర్‌షిప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. హర్యానాలోని మానేసర్ ప్లాంట్‌లో తయారు చేస్తున్న ఈ బైక్, పాన్ ఇండియా ఎక్స్-షోరూమ్ ధర రూ.1,14,990గా నిర్ణయించబడింది. పర్యావరణానికి మేలు చేసే, ఖర్చు తగ్గించే ఇంకా సాంకేతికతతో నిండిన Revolt RV BlazeX, ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్‌లో చెలరేగే సునామీ సృష్టించడానికి సిద్ధమైంది. తక్కువ ఖర్చుతో అధిక ఫీచర్లను అందిస్తుండటంతో, ఈ ఎలక్ట్రిక్ బైక్ రెండు చక్రాల వాహన ప్రేమికులను ఆకట్టుకోనుంది.