Revanth Reddy Swearing-in Ceremony: ఎల్బీ స్టేడియంలో తెలంగాణకు రెండవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. ఇక, రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారానికి ఢిల్లీ నుంచి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాలు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో పాటు ఏఐసీసీ నేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. ఇక, రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేస్తున్నప్పుడు ఒక్కసారిగా అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కేరింతలతో దద్దరిల్లింది.
Read Also: Chief Minister Revanth Reddy Live Updates: రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం లైవ్ అప్డేట్స్
ఇక, తెలంగాణ కొత్త సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేస్తున్న వేళ ఎల్.బి.స్టేడియంలో సందడి వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ అగ్రనేతలు అందరూ తరలి రావడంతో స్టేడియం లోపల, వెలుపల భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉదయం నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు స్టేడియానికి వచ్చారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి విచ్చేసే అతిధులను అలరించేందుకు 500 మంది కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు సైతం ఏర్పాటు చేశారు. అలాగే, భట్టి విక్రమార్క మల్లు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళసై ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. మరో వైపు.. ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ప్రమాణం స్వీకారం చేశారు. గవర్నర్ తమిళసై ఆయన చేత ప్రమాణం చేయించారు.