వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రానున్న 20 నుంచి 30 ఏళ్ల పాటు జగన్ సీఎం గా ఉండనున్నారు.. కొందరికి పార్టీలో కొన్ని సమీకరణాల కారణంగా పదవులు దక్కలేదు అని పేర్కొన్నారు. ప్రస్తుతం పదవులు అందని వారికి జగన్ మళ్లీ న్యాయం చేస్తారు.
ఎల్బీ స్టేడియంలో తెలంగాణకు మూడవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. ఇక, రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారానికి ఢిల్లీ నుంచి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాలు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో పాటు ఏఐసీసీ నేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ను కాంగ్రెస్ అధిష్టానం ఫైనల్ చేసింది. ఇక, వికారాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రసాద్ కుమార్.. గతంలో టెక్స్‌టైల్ శాఖ మంత్రిగా పని చేశారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో వెలసిన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార శుభాకాంక్షలతో బ్యానర్లు వెలశాయి. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో కలిసిన బ్యానర్లను టీడీపీ నేతలు ఏర్పాటు చేశారు.
ప్రగతి భవన్ ముందున్న బ్యారికేడ్స్ లోపలి నుంచి ట్రాఫిక్ కు పోలీసులు అనుమతి ఇచ్చారు. బ్యారికేడ్స్ తొలగింపుతో ట్రాఫిక్ కు పర్మిషన్ ఇచ్చారు. ట్రాఫిక్ పోలీసులకు ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ఈ చర్య కొనసాగుతుంది.