Chief Minister Revanth Reddy Live Updates: ఎనుముల రేవంత్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నాను.. అంటూ హైదరాబాద్ ఎల్బీస్టేడియంలో అమరవీరుల కుటుంబాల సాక్షిగా, వేలాది తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్ అభిమానుల కేరింతల నడుమ ప్రమాణ స్వీకారం చేశారు. రేవంత్ రెడ్డితో గవర్నర్ సౌందర రాజన్ తమిళిసై రేవంత్ రెడ్డితో ప్రమాణం చేపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్ సీఎంలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. ఎల్బీస్టేడియంలో రేవంత్ తో పాటు మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తున్నారు. సీఎంగా రేవంత్‌తో పాటు 11 మంది ప్రమాణస్వీకారం చేయనున్నారు. సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు మొత్తం 12 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఎల్బీ స్టేడియంలో ప్రమాణస్వీకార కార్యక్రమం ముగిసిన అనంతరం రేవంత్ రెడ్డి నేరుగా సచివాలయానికి చేరుకుని తన ఛాంబర్‌లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
Revanth Reddy: 8వ నంబర్ గేటు నుంచి సీఎం ఎంట్రీ.. మధ్యాహ్నం సచివాలయానికి రేవంత్ రెడ్డి
ఎల్బీనరగ్ స్టేడియంలో సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణం చేశారు. అనంతరం తెలంగాణ ప్రజల గురించి ప్రసంగించారు. ఎల్బీనగర్ కార్యక్రమ అనంతరం అక్కడి నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సచివాలయానికి బయలు దేరారు. సీఎంకు సచివాలయ అధికారులు స్వాగతం పలకనున్నారు.
ఆరు గ్యారెంటీలపై సీఎం రేవంత్ రెడ్డి తొలి సంతకం చేయనున్నారు. అనంతరం దివ్యాంగురాలు రజనీకి ఉద్యోగ నియామక పత్రంపై రెండో సంతకం పెట్టనున్నారు.
ప్రజాభవన్ లో ప్రజా పరిపాలన అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాభవన్ కు ప్రజలు ఎప్పుడైనా రావొచ్చన్నారు. కాంగ్రెస్ సమిధగా మారి తెలంగాణ ఇచ్చిందని తెలిపారు. అమరవీరుల ఆకాంక్షలను నెరవేరుస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో ప్రజలే భాగస్వాములన్నారు.
ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తొలి ప్రసంగంతో స్టేడియం దద్దరిల్లింది. తెలంగాణ ఎన్నో త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ రాష్ట్రం అన్నారు రేవంత్ రెడ్డి. ఈ ప్రభుత్వ ఏర్పాటుతో తెలంగాణ మొత్తం అభివృద్ది చెందుతుందన్నారు. ప్రగతిభవన్ చుట్ట ఉన్న ఇనుప కంచెలను బద్దలు కొట్టించా అన్నారు. పదేళ్లబాధలను ప్రజలు మౌనంగా భరించారని సీఎం రేవంత్ అన్నారు. గత ప్రభుత్వం ప్రజల బాధలు పట్టించుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో హర్షం వ్యక్తం చేస్తూ టపాసులు కాల్చి, మిఠాయిలు పంపిణీ చేసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్న
తెలంగాణ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్‌రెడ్డి
డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన మల్లు భట్టి విక్రమార్క
మంత్రిగా ప్రమాణ చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి
మంత్రిగా ప్రమాణం చేసిన దమోదర రాజనరసింహ
మంత్రిగా ప్రమాణం చేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
మంత్రిగా ప్రమాణం చేసిన దుద్దిళ్ల శ్రీదర్ బాబు
మంత్రిగా ప్రమాణం చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
మంత్రిగా ప్రమాణం చేసిన పొన్నం ప్రభాకర్
మంత్రిగా ప్రమాణం చేసిన కొండా సురేఖ
మంత్రిగా ప్రమాణం చేసిన డి. అనసూయ సీతక్క
మంత్రిగా ప్రమాణం చేసిన తుమ్మల నాగేశ్వర్ రావు
మంత్రిగా ప్రమాణం చేసిన జూపల్లి కృష్ణారవు
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబులు ప్రమాణం చేశారు.
తెలంగాణ మంత్రులుగా కొండా సురేఖ, దనసరి అనసూయ సీతక్కలు ప్రమాణం చేశారు. సీతక్క ప్రమాణం చేసే సమయంలో సభ హోరెత్తింది.
తెలంగాణ మంత్రులుగా పొంగులేటి, పొన్నం ప్రభాకర్‌లు ప్రమాణ స్వీకారం చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రిగా మధ్యాహ్నం 1.20కు ప్రమాణం చేశారు. గవర్నర్ తమిళ సై రేవంత్ రెడ్డితో ప్రమాణం చేయించారు. రేవంత్ తర్వాత మల్లుభట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ ప్రమాణ స్వీకారం చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్ రెడ్డి ఇవాల ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ రేవంత్ రెడ్డితో ప్రమాణం చేయించారు.ఇవాల ఎల్ బీ స్టేడియంలో రేవంత్ రెడ్డితో సీఎంగా ప్రమాణం చేయించారు గవర్నర్. రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు.తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఈ ఏడాది నవంబర్ 30 పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 64 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించారు. భారత రాష్ట్ర సమితి 39 స్థానాలకు మాత్రమే పరిమితమైంది.
తెలంగాణ మంత్రులతో ప్రమాణం చేయిస్తున్న గవర్నర్ తమిళిసై. డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క ప్రయాణం చేశారు. అంతకు ముందు రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణం చేశారు. అనంతరం మంత్రులతో గవర్నర్ ప్రమాణం చేయిస్తున్నారు.
ఎల్బీనగర్ స్టేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం మొదలైంది. తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారణ చేశారు. వేదికపై సోనియా, రాహుల్, ప్రియాంక.
రేవంత్‌రెడ్డితో ప్రమాణ చేయించిన గవర్నర్.
ఎల్బీ స్టేడియంకు చేరుకున్న గవర్నర్ తమిళి సై చేరుకున్నారు. రాజ్ భవన్ నుంచి ఎల్బీ స్టేడియానికి తమిళిసై బయల్దేరారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించనున్న గవర్నర్ తమిళిసై. గవర్నర్‌ను రేవంత్ స్టేజ్ పై ఆహ్వానించారు.
ఎల్బీనగర్ స్టేడియంలో ఏఐసీసీ అగ్రనేతలు చేరుకున్నారు. కాసేపట్లో తెలంగాణ కొత్త ప్రభుత్వం కొలువు దీరనుంది. ఎల్బీస్టేడియంలో రేవంత్ తో పాటు మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. సీఎంగా రేవంత్‌తో పాటు 11 మంది ప్రమాణస్వీకారం చేయనున్నారు. సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు మొత్తం 12 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ఎల్బీ స్టేడియంలోకి ప్రత్యేక వాహనంలో రేవంత్ రెడ్డి, సోనియా గాంధీ ఎంట్రీ ఇచ్చారు.. కాసేపట్లో తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు.
కాసేపట్లో ఎల్బీ స్టేడియానికి గవర్నర్ తమిళి సై చేరుకోనున్నారు. రాజ్ భవన్ నుంచి ఎల్బీ స్టేడియానికి తమిళిసై బయల్దేరారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించనున్న గవర్నర్ తమిళిసై..
అసెంబ్లీ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఏఐసీసీ నేతలకు ట్రాఫిక్ కష్టాలు ఎదుర్కొన్నారు. అసెంబ్లీ సమీపంలోని అమరవీరుల స్థూపం దగ్గర ట్రాఫిక్ లో నేతలు చిక్కుకున్నారు. రవీంద్రభారతి దగ్గర కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కాన్యాయ్ ట్రాఫిక్ లో చిక్కుకుంది. దీంతో ఏమీ చేయలేక కాన్యాయ్ వదిలేసి సిద్ధరామయ్య, డీకే శివకుమార్ నడుచుకుంటు వెళ్లారు.
రవీంద్ర భారతి సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ లో చిక్కుకున్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య.. ఇప్పటికే ఎల్బీ స్టేడియానికి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, రేవంత్, భట్టి.. ఒకే కాన్వాయ్ లో బయలుదేరిన సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ..
తనపై నమ్మకంతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. రాజకీయంగా ఎన్నో అవకాశాలిచ్చిన కాంగ్రెస్ పార్టీకి, సోనియా, రాహుల్, ప్రియాంక, రేవంత్‌లకు ధన్యవాదాలు అన్నారు. ఈ జీవితం ప్రజలకే అంకితం అన్నారు. ఏ మంత్రి పదవి ఇచ్చినా నిజాయితీతో పనిచేస్తా అన్నారు. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటా అని తెలిపారు. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో మరకలేకుండా పని చేశా అన్నారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం, ప్రజా పరిపాలన రాబోతుందన్నారు. ఆరు గ్యారెంటీల హామీని అమలు చేయబోతున్నామని తెలిపారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగానే మా పాలన కొనసాగతుందని పొంగులేటి అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తామన్నారు. గత ప్రభుత్వంలా కక్షపూరితంగా మేం వ్యవహరించం అని తెలిపారు.
మంత్రి అవుతానని ముందే ఊహించా అని పొన్నం ప్రభాకర్ అన్నారు. ఏ పోర్ట్ పోలీయో ఇచ్చినా సమ్మతమే అని తెలిపారు. మంత్రి కావాలనే కోరిక నెరవేరిందని ఆనందం వ్యక్తం చేశారు. మంత్రి అయినా ప్రజా సేవకుడిగా పని చేస్తానని తెలిపారు.
ఎల్లా హోటల్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బస్సుల్లో బయలు దేరారు. హై సెక్యూరిటీ నడుమ బస్సులను తరలిస్తున్నారు. పొన్నం ప్రభాకర్ ముందు వరుసలో ఉండి.. ఎమ్మెల్యేలు అంతా అభివాదం చేస్తూ బస్సుల్లో స్టార్ట్ అయ్యారు.
గడ్డం ప్రసాద్ కుమార్ తెలంగాణ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. 2008 ఉపఎన్నికల్లో తొలిసారి గెలిచిన గడ్డం ప్రసాద్ కుమార్ కిరణ్‌కుమార్ మంత్రి వర్గంలో పనిచేశారు. 2014, 2018లో ఓటమి పాలయ్యారు. వికారాబాద్ నుంచి తాజాగా ఎన్నికయ్యారు.
రవీంద్ర భారతి వద్ద కర్ణాటక సిఎం సిద్ధరామయ్య కాన్వాయ్ ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. రవీంద్ర భారతి వద్ద ట్రాఫిక్ భారీగా నిలిచిపోవడంతో పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు.
ఇవాళ తెలంగాణ సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తున్న రేవంత్ రెడ్డికి తమిళనాడు సీఎం స్టాలిన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. పదవీకాలం విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు. రేవంత్ తో ఫోన్ లో కూడా స్టాలిన్ మాట్లాడారు. కాగా రేవంత్ ప్రమాణస్వీకారానికి స్టాలిన్ కూడా ఆహ్వానం పంపారు. కానీ తమిళనాడులో వర్షాలు బీభత్సం సృష్టి్ంచడంతో ఆయన హాజరు కావడం లేదు.
హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖ్ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో రేవంత్ రెడ్డి ఘనస్వాగతం పలికారు. శంషాబాద్ నుంచి నేరుగా తాజ్ కృష్ణ హోటల్ కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ గారితో కలిసి ఎల్బీ స్టేడియంకు చేరుకోనున్నారు. ఎల్బీ స్టేడియంలో మధ్యాహ్నం 1.04 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
రాష్ట్రం లో ప్రజా పాలన వచ్చిందని, నా లక్ష్య కెసిఆర్ పైన పోరాటమే అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. నేను కాంగ్రెస్ పార్టీలో చేరినాక..మా నలగొండ జిల్లాలో పార్టీ బలపడిందన్నారు. మొదటి విడతలో నా సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మంత్రి వర్గం లో స్థానం దక్కిందని తెలిపారు. రెండో విడతలో నాకు కూడా మంత్రి పదవి వస్తుందని అధిష్టానం చెప్పిందన్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరికీ మంత్రి పదవులు అన్నది...వాళ్ళ , వాళ్ళ కెపాసిటీ నీ బట్టి వుంటుందని అన్నారు.
ఈ రాష్ట్రం లో మేము హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీ లను అమలు చేయబోతున్నామని తెలిపారు.
ఎల్బీనగర్ స్టేడియంలోకి పాస్ లేకున్నా సామాన్యులకు అనుమతిస్తున్నారు. గేట్ నెంబర్ 6 ద్వారా లోపలికి అభిమానులు, ప్రజలు వెళ్తున్నారు. ఎల్బీనగర్ స్టేడియం దగ్గరకు పెద్ద ఎత్తున జనం తరలి వస్తున్నారు.
ఎల్ల హోటల్ నుంచి ఎల్బీనగర్ కు బస్సులు బయలుదేరాయి. హై సెక్యూరిటీ నడుమ బస్సులను తరలిస్తున్నారు పోలీసులు. పొన్నం ప్రభాకర్ ముందు వరుసలో ఉండి... ఎమ్మెల్యేలు అంతా అభివాదం చేస్తూ బస్సుల్లో స్టార్ట్ అయ్యారు.
జూబ్లిహిల్స్ పెద్దమ్మ తల్లిని రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు.
తెలంగాణ సిఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హైదరాబాద్ చేరుకున్నారు. విమనాశ్రయంలో వారికి రేవంత్ స్వాగతం పలికారు.
ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు ఆ పార్టీకి చెందిన ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ముఖ్యనేతలు హాజరుకానున్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీకి స్వయంగా రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. 10.30గంటలకు హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్‌సింగ్, 10.45కు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మధ్యాహ్నం 12 గంటలకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రానున్నారు.
ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిశాక రేవంత్‌రెడ్డి నేరుగా సచివాలయానికి చేరుకుని.. తన చాంబర్‌లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర సీనియర్ ఐఏఎస్ అధికారులతో సమావేశమై రాష్ట్రంలో పాలన పరిస్థితులు, ఇతర అంశాలపై సమీక్షించే అవకాశం ఉంది.
రేవంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా, సీనియర్ నేతలు కె.నారాయణ, సయ్యద్ అజీజ్ పాషా, చాడ వెంకటరెడ్డి తదితరులు హాజరుకానున్నారు. కాంగ్రెస్ కూటమితో కలిసి సిపిఐ తరపున కూనంనేని సాంబశివరావు విజయం సాధించారు.
ఎల్ బి స్టేడియంలో 8వ నంబర్ గేట్ నుండి ముఖ్యమంత్రి ప్రవేశానికి ఏర్పాట్లు చేశారు. స్టేడియం సామర్థ్యం మొత్తం 80 వేల మందికి ప్రవేవానికి అనుమతించే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. స్టేడియం చుట్టు పక్కల ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని, సిసిటీవీ కెమెరాలతో బందోబస్త్ ఏర్పాటు చేస్తున్నట్లు సెంట్రల్ జోన్ డీసీపీ తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు సూచించిన స్థలా
ఎల్బీ స్టేడియంలో రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం, తర్వాత సచివాలయానికి వెళ్లనుండటం నేపథ్యంలో పోలీసు శాఖ కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘా పెట్టింది. గురువారం ఉదయం నుంచే ఎల్‌బీ స్టేడియం, సచివాలయం పరిసరాల్లో సుమారు 2వేల మంది పోలీసులను మోహరించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయనున్నారు.
తెలంగాణ కేబినెట్లో చోటు కల్పించిన మంత్రుల జాబితాను రాజ్ భవన్‌కు పంపించారు. అయితే వీరిలో మల్లు భట్టి విక్రమార్కకు డిప్యూటీ సీఎం పదవి దక్కుతుందని చెబుతున్నారు. మరికొందరిని కూడా కొద్ది రోజుల్లోనే మంత్రివర్గంలోకి తీసుకుంటారని చెబుతున్నారు. అయితే శాఖల కేటాయింపుపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఎన్నికల్లో ఓడిపోయిన కొందరు సీనియర్ నేతలకు కేబినెట్‌లో అవకాశం కల్పిస్తారని ప్రచారం జరిగింది.. ప్రస్తుతానికి ఎవరికీ అవకాశం ఇవ్వలేదు.
జూబ్లీహిల్స్‌లోని రేవంత్ నివాసం దగ్గర కాన్వాయ్‌ను అధికారులు సిద్ధం చేశారు. ఆయన ఇంటివైపు వెళ్లే మార్గాల్లో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు ఆ పార్టీకి చెందిన ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ముఖ్యనేతలు హాజరుకానున్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీకి స్వయంగా రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. 10.30గంటలకు హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్‌సింగ్, 10.45కు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మధ్యాహ్నం 12 గంటలకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రానున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు మరో 11మందికి మంత్రి పదవులు దక్కనున్నాయి. ముఖ్యమంత్రితో పాటు 17మందికి క్యాబినెట్ పదవులు దక్కే అవకాశం ఉండగా మరికొన్ని పదవులకు మలి విడతలో విస్తరణ చేపట్టే అవకాశం ఉంది. నేడు మంత్రులు గా ప్రమాణ స్వీకారం చేయనున్న భట్టి విక్రమార్క , కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ,శ్రీధర్ బాబు,ఉత్తమ్ కుమార్ రెడ్డి ,జూపల్లి కృష్ణారావు ,సీతక్క ,కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్ ,తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముఖ్యమంత్రితో పాటు మరో 10 మంది మంత్రులు ముందుగా ప్రమాణ స్వీకారం చేసి ఆ తర్వాత మంత్రివర్గాన్ని విస్తరించాలని అంటున్నారు.
తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా మరికాసేపట్లో రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గురువారం మధ్యాహ్నం 1.04 గంటలకు సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు.