Revanth Reddy : ఉద్యమాల ఖిల్లా ఓరుగల్లు నీవురుగప్పిన నిప్పులా ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హాత్ సే హాత్ జోడో పేరిట టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర కొనసాగుతోంది. 12వ రోజు.. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో పాదయాత్ర చేసిన ఆయన… హన్మకొండ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తొమ్మిదేళ్లుగా అక్రమ కేసులు ఎదుర్కొని జైళ్లలో మగ్గిన వారు ఈ మీటింగ్ కు వచ్చారని ఆయన అన్నారు. ఉద్యమాల ఖిల్లా ఓరుగల్లు నీవురుగప్పిన నిప్పులా ఉందని, ఎప్పుడు ఎన్నికలు వచ్చిన కేసీఆర్ ప్రభుత్వాన్ని కూకటివేళ్ళతో పెకిలించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు కూడా భూకబ్జాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. మేధావులు, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు, జర్నలిస్టులు, కవులు, కళాకారులు ఆలోచన చేయాలని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుతున్నాయా? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబం కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందా? అని ఆయన అన్నారు. అంతేకాకుండా.. ‘కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ బొందలగడ్డగా మారింది. జయశంకర్ పేరు పెట్టిన ఏకశిలా పార్కు తాగుబోతులకు అడ్డాగా మారింది. కాకతీయ కళాక్షేత్రం కట్టలేదు. అంబేద్కర్ విగ్రహం పెట్టలేదు. తొమ్మిదేళ్లయినా అమరవీరుల స్థూపం ఎందుకు కావట్లేదు. రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయలేదు. కాలనీలు, శిఖం భూములు అన్ని కబ్జాలు అయ్యాయి.
Also Read : Off The Record: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరు? ముగ్గురులో రెన్యువల్ ఎవరికి?
Also Read
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్‌పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
ఎమ్మెల్యేలు దందుపాళ్యం ముఠా. కార్పొరేషర్ పరిధిలోని ఐదుగురు ఎమ్మెల్యేలు వందల కోట్లకు పడగలెత్తారు. ఎంపీ దయాకర్ హన్మకొండ సిటీలో ఐదు ఎకరాలు కబ్జా పెట్టిండు.. ప్రణయ్ భాస్కర్ కు మంచిపేరుండే.. ఆయన తమ్మునిగా వినయ్ భాస్కర్ ప్రజల ముందుకు వచ్చాడు.. అన్నకు సున్నం పెట్టిండు, ఆయన కుటుంబ సభ్యులు ఎక్కడున్నారు.. తెలంగాణ గడ్డమీద కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతుందనే నమ్మకం కలుగుతుంది.. నాయకులతో సంబంధం లేకుండా సోనియాగాంధీ బొమ్మతో ఎవరు నిలబడ్డ గెలుస్తారు.. నేను కార్యకర్తలకు నాయకుణ్ణి, నాయకులకు కాదు. అందరి సమక్షంలో మాట ఇస్తున్న, కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వారిని ఆదుకుంటాం.. దందుపాళ్యం ముఠాకు హచ్చరిస్తున్నా, కొత్త సంవత్సరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ కార్యకర్తలను అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న వారిని వదిలిపెట్టం. పోలీసులకు కూడా హెచ్చరిస్తున్నాను, ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేయకండి.
మీరు రిటైర్ అయినా వదిలిపెట్టం. ప్రజాలల్లో మార్పు వచ్చింది, మా నాయకులల్లో కూడా మార్పు వచ్చింది, మేమంతా ఐక్యంగా ఉన్నాం.’ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Also Read : MLA Sayanna : ఉద్రిక్తతల మధ్య ముగిసిన సాయన్న అంత్యక్రియలు
తాజావార్తలు
-
Hatha: పిల్లి చుట్టూ తిరిగే మిస్టరీ!.. ఇంటెన్స్ గా కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్
-
Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
-
Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
-
NBK111 : బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
-
Suriya 49: ‘సూర్య 49’లో విలన్ గా అక్కినేని నాగార్జున?.. భారీ క్లాష్ రాబోతోందా?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!